News


ఓలా ఎలక్ట్రిక్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడులు

Wednesday 3rd July 2019
news_main1562135774.png-26756

  • రూ.1,725 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన సాఫ్ట్‌బ్యాంక్‌ 

న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌ వాహన విభాగం, ఓలా ఎలక్ట్రిక్‌​ మొబిలిటీ(ఓఈఎమ్‌)లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ రూ.1,725 కోట్లు(25 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టింది. ఈ మేరకు సమాచారాన్ని నియంత్రణ సంస్థలకు ఓఈఎమ్‌ వెల్లడించింది. రూ.10 ముఖ విలువ గల పూర్తిగా, తప్పనిసరిగా మార్చుకునే సిరీస్‌ బి ప్రిఫెరెన్స్‌ షేర్లను సాఫ్ట్‌బ్యాంక్‌ టొపాజ్‌ (కేమ్యాన్‌) లిమిటెడ్‌కు జారీ చేయడం ద్వారా రూ.1,725 కోట్లు సమీకరించామని ఓఈఎమ్‌ పేర్కొంది. దీంతో సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడులు పెట్టిన భారత సం‍స్థల్లో ఒకటిగా ఓఈఎమ్‌ చేరింది. సాఫ్ట్‌బ్యాంక్‌ ఇప్పటివరకూ ఫ్లిప్‌కార్ట్‌, జొమాటొ, పేటీఎమ్‌, ఓఈఎమ్‌ మాతృసంస్థ ఓలాలో కూడా పెట్టుబడులు పెట్టింది. కాగా ఓలాలో అతి పెద్ద సింగిల్‌ ఇన్వెస్టర్‌గా సాఫ్ట్‌బ్యాంక్‌ నిలిచింది. 
రతన్‌ టాటా పెట్టుబడులు...
ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీలో టాటా సన్స్‌ చైర్మన్‌ ఎమెరిటస్‌ రతన్‌ టాటా కూడా పెట్టుబడులు పెట్టారు. ఓఈఎమ్‌ సిరీస్‌ ఏ పెట్టుబడుల్లో భాగంగా రతన్‌ టాటా పెద్దమొత్తంలోనే ఇన్వెస్ట్ చేశారు. టైగర్‌ గ్లోబల్‌, మ్యాట్రిక్స్‌ ఇండియా సంస్థలు కూడా ఓఈఎమ్‌లో రూ.400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. 
పది లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలు..
భారత్‌లో 2021 కల్లా పది లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలను నడపాలని ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంట్లో భాగంగా చార్జింగ్‌ సొల్యూషన్స్‌, బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లు, టూ, త్రీ,-ఫోర్‌ వీలర్‌ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్‌ వాహనాలను సమకూర్చుకోవడం తదితర కార్యకలాపాలు చేపడుతోంది. 



You may be interested

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌లో రూ.325 కోట్లు పెట్టుబడులు

Wednesday 3rd July 2019

భారతీ ఎయిర్‌టెల్‌ రూ.260 కోట్లు  భారతీ ఎంటర్‌ప్రైజెస్‌..రూ.65 కోట్లు న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌లు రూ.325 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. ప్రిఫరెన్స్‌ షేర్ల రూపంలో భారతీ ఎయిర్‌టెల్‌ రూ.260 కోట్లు, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.65 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయని మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ, టోఫ్లర్‌ తెలిపింది. కాగా ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, కార్యకలాపాల పునర్వ్యస్థీకరణకు పెట్టుబడులు కొనసాగిస్తామని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌

ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో పేటీఎమ్‌, టెన్సెంట్‌ పెట్టుబడులు

Wednesday 3rd July 2019

రూ.860 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ న్యూఢిల్లీ: టైమ్స్‌ ఇంటర్నెట్‌ ఆన్‌లైన్‌ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌, ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో భారీ పెట్టుబడులు రానున్నాయి. ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో డిజటల్‌ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌, చైనా ఇంటర్నెట్‌ సంస్థ, టెన్సెంట్‌లు ఈ నెలలోనే రూ.860 కోట్ల(12.5 కోట్ల డాలర్ల)మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. భారత ఇంటర్నెట్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే వ్యూహంలో భాగంగా టెన్సెంట్‌ కంపెనీ ఈ పెట్టుబడులు పెడుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీర్ఘకాల పెట్టుబడుల వ్యూహంలో

Most from this category