News


ఓలా సెల్ఫ్‌ డ్రైవ్‌ సేవలు ప్రారంభం

Friday 18th October 2019
news_main1571374113.png-28971

  • తొలుత బెంగళూరులో కార్లు
  • త్వరలోనే హైదరాబాద్‌లో సేవలు

న్యూఢిల్లీ: ట్యాక్సీ ఆగ్రిగేటర్‌ ఓలా.. తాజాగా సెల్ఫ్‌ డ్రైవ్‌ సేవలను ప్రారంభించింది. ‘ఓలా డ్రైవ్‌’ పేరిట తొలుత బెంగళూరులో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా ప్లే ప్లాట్‌ఫాంకు అనుసంధానమైన ఈ కార్లలో 24/7 హెల్ప్‌లైన్, అత్యవసర బటన్, రియల్ టైమ్ ట్రాకింగ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. రెండు గంటల పాటు కారును పొందడం కోసం సెక్యూరిటీ డిపాజిట్ రూ. 2,000 ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్లను అందుబాటులో ఉంచిన ఓలా.. బుధవారం వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచింది. త్వరలోనే హైదరాబాద్‌, ముంబై, న్యూ ఢిల్లీల్లో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం స్వల్పకాలిక సెల్ఫ్ డ్రైవ్ కార్-షేరింగ్ సేవలను తీసుకొచ్చిన ఈ సంస్థ.. దీర్ఘకాలిక చందా, కార్పొరేట్ లీజింగ్‌తో పాటు భవిష్యత్తులో మరిన్ని ఆప్షన్లను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించింది. ఇక 2020 నాటికి ఈ సేవల్లో 20,000 కార్లను అందుబాటులో ఉంచనున్నామని, ఇందుకోసం వచ్చే రెండేళ్లలో 500 మిలియన్‌ అమెరికా డాలర్లు (రూ. 3,500 కోట్లు)పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ అరుణ్ శ్రీనివాస్ వెల్లడించారు. 



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ.242 కోట్ల నష్టాలు

Friday 18th October 2019

క్యూ2 ఫలితాల ప్రకటన న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గృహ రుణాల సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాలను గురువారం విడుదల చేసింది. రూ.242 కోట్ల నష్టాలను ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.431 కోట్ల లాభం కంపెనీకి రావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.3,154 కోట్లుగా ఉండగా, తాజాగా అది రూ.2,400 కోట్లకు తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం రెండో భాగం నుంచి తీవ్ర

నియంత్రణ సంస్థ, ఆడిటర్లదే బాధ్యత

Friday 18th October 2019

బ్యాంకుల్లో మోసాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: పంజాబ్‌ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ సహా ఇతర బ్యాంకుల్లో చోటు చేసుకున్న మోసాలకు.. నియంత్రణ సంస్థ, యాజమాన్యం, ఆడిటర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. "పీఎంసీ బ్యాంకు కానీ.. మరే బ్యాంక్ అయినా కానీ వాటికి సంబంధించిన సమస్యలను పరిశీలించడం నియంత్రణ సంస్థల బాధ్యత. ఆడిటర్‌ కూడా బాధ్యత

Most from this category