News


ఎయిర్‌ ఇండియాకు ఇంధన సరఫరా నిలిపివేత

Friday 23rd August 2019
news_main1566540350.png-27966

  • బకాయిలు చెల్లించకపోవడం వల్లే 

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియాకు ఇంధన సరఫరాలను ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిలిపివేశాయి. విశాఖపట్టణం, కొచ్చిన్‌, మోహాలీ, రాంచి, పుణే, పాట్నా... ఈ ఆరు విమానాశ్రయాల్లో ఎయిర్‌ ఇండియా విమానాలకు ఇంధన సరఫరాలను గురువారం సాయంత్రం గం. 4 ల నుంచి ఆపేశామని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఎయిర్‌ ఇండియా సంస్థ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ ఇంధన సరఫరాల నిలిపివేత కారణంగా ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదని వివరించారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా తమ పనితీరు చాలా బాగుందని ఎయిర్‌ ఇండియా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆరోగ్యకరమైన నిర్వహణ లాభం సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నామని పేర్కొన్నారు. వాటా విక్రయం ద్వారా నిధుల లభించని పక్షంలో భారీగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకోలేమని తెలిపారు. 



You may be interested

మార్కెట్లోకి ‘కియా సెల్టోస్‌ ఎస్‌యూవీ’

Friday 23rd August 2019

ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ తాజాగా తన ‘సెల్టోస్‌ మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీ’ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో ఇటీవలే తొలి కారును ఆవిష్కరణ కంపెనీ.. గురువారం దేశవ్యాప్తంగా విడుదలచేసింది. ఈకారు ధరల శ్రేణి రూ.9.69 లక్షలు నుంచి రూ.15.99 లక్షలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 32,035 బుకింగ్స్‌ పూర్తయినట్లు సంస్థ ఎండీ, సీఈఓ కూక్‌ హున్‌ షిమ్‌ ఈ సందర్భంగా

లాభాల కోసం ‘ప్రైవేటు’ పనిచేయడం తప్పేంటి?

Friday 23rd August 2019

‘లాభాలు ప్రైవేట్‌, నష్టాలు పబ్లిక్‌ ’ వంటి విధానం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ప్రకటించిన ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ వ్యాఖ్యలతో పూర్తిగా నిరాకరిస్తున్నానని హీరో గ్రూప్ వ్యవస్థాపక ప్రమోటర్ సునీల్ కాంత్ ముంజాల్ ఓ ఇంటర్యూలో అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థలను గమనిస్తే అవి ఏ విధంగా అభివృద్ధి చెందాయో తెలుస్తుందని తెలిపారు. ‘ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించే ఆర్థిక వ్యవస్థలలో మనది

Most from this category