News


ఆయిల్‌ ఇండియా రూ.7,000 కోట్ల సమీకరణ

Monday 24th September 2018
news_main1537765411.png-20504

ముంబై: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం, ఆయిల్‌ ఇండియా కంపెనీ రూ.7,000 కోట్ల సమీకరణకు ఆ కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. బాండ్ల జారీ,  డిబెంచర్లను ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన జారీ చేయడం ద్వారా ఈ నిధులు సమీకరించనున్నామని ఆయిల్‌ ఇండియా తెలిపింది. అంతేకాకుండా నలుగురు ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల(ఆషా కౌల్‌, ప్రియాంక్‌ శర్మ, ఎస్‌. మనోహరన్‌, అమినా ఆర్‌.ఖాన్‌) నియామానికి కూడా వాటాదారులు ఆమోదం తెలిపారని పేర్కొంది. శనివారం జరిగిన కంపెనీ 59వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌)లో అజెండాలోని అన్ని అంశాలకు వాటాదారులు తగిన మెజారిటీతో ఆమోదం తెలిపారని వివరించింది.



You may be interested

మార్కెట్‌ కదలికలపై ఆర్‌బీఐ, సెబీల పర్యవేక్షణ

Monday 24th September 2018

ముంబై: శుక్రవారం దేశీ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిన నేపథ్యంలో ఫైనాన్షియల్‌ మార్కెట్లను అతి దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించాయి. సెన్సెక్స్‌ ఒక్కసారిగా 1,127 పాయింట్లను కోల్పోయిన అంశంపై పర్యవేక్షణ చేస్తున్నామని, ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు విడివిడిగా ప్రకటించాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడులకు సంబంధించిన కేవైసీ నిబంధనలను

అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా ఢిల్లీ విమానాశ్రయం

Monday 24th September 2018

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఐజీఐ) .. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో 16వ స్థానం దక్కించుకుంది. 2017లో మొత్తం 6.34 కోట్ల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారు. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) నివేదిక ప్రకారం 2016లో 22వ స్థానంలో ఉన్న ఐజీఐ.. 2017లో 14 శాతం ప్యాసింజర్ల వృద్ధితో ఆరు స్థానాలు ఎగబాకింది. మరోవైపు అమెరికాలోని అట్లాంటాలో హార్ట్స్‌ఫీల్డ్‌-జాక్సన్‌

Most from this category