News


వరుసగా నాలుగో క్వార్టర్‌లోనూ ఓబీసీకి లాభాలు

Tuesday 23rd July 2019
news_main1563864635.png-27251

  • మెరుగుపడిన రుణ నాణ్యత
  • తగ్గిన మొండి బకాయిలు
  • పెరిగిన ట్రెజరీ ఆదాయం 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.113 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.393 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఓబీసీ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, గత క్యూ4లో రూ.202 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది.  రుణ నాణ్యత మెరుగుపడటం, మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు తక్కువగా ఉండటం, ట్రెజరీ ఆదాయం పెరగడం.. తదితర కారణాల  వల్ల గత క్యూ1లో నికర లాభం సాధించామని ఓబీసీ ఎమ్‌డీ, సీఈఓ ముకేశ్‌ జైన్‌ తెలిపారు.  వరుసగా నాలుగో క్వార్టర్‌లోనూ లాభాలు సాధించామని పేర్కొన్నారు. గత క్యూ1లో రూ.4,730 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.5,635 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 
సాధారణంగా జూన్‌ క్వార్టర్‌లో వ్యాపారం మందకొడిగా ఉంటుందని, అయినప్పటికీ, రూ. లక్ష కోట్ల మేర వ్యాపారం సాధించామని  ముకేశ్‌ జైన్‌ తెలిపారు. ట్రెజరీ ఆదాయం రూ.76 కోట్ల నుంచి రూ.179 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. వడ్డీ ఆదాయం రూ.4,269 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ,.4,919 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇతర ఆదాయం రూ.461 కోట్ల నుంచి 55 శాతం వృద్ధితో రూ.715 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్‌ 2.82 శాతం నుంచి 2.41 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. 
రూ.3,000 కోట్ల సమీకరణ...
స్థూల మొండి బకాయిలు 17.89 శాతం నుంచి 12.56 శాతానికి, నికర మొండి బకాయిలు 10.63 శాతం నుంచి 5.91 శాతానికి తగ్గాయని జైన్‌ వివరించారు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,222 కోట్ల నుంచి రూ.865 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. మార్కెట్‌ పరిస్థితులు మెరుగుపడితే, క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ మార్గంలో రూ.3,000 కోట్లు సమీకరించనున్నామని తెలిపారు. 

 



You may be interested

టీఎస్‌ఎస్‌ గ్రూప్‌లో ఆర్‌వోసీ సోదాలు!

Tuesday 23rd July 2019

బోర్డుల్లేవు.. ఉద్యోగుల్లేరు; బ్యాలెన్స్‌షీట్లూ వేయలేదు కార్యకలాపాలు లేకున్నా రూ.500 కోట్లకు పైగా రుణాలు మరిన్ని తనిఖీలు జరిపాక చర్యలు: ఆర్‌ఓసీ వర్గాలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టీఎస్‌ఎస్‌ గ్రూప్‌లో రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) హైదరాబాద్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. గ్రూప్‌ కంపెనీల్లో భారీగా నగదు లావాదేవీలు, అవకతవకలు జరిగాయన్న సమాచారంతో ఈ సోదాలు జరిపినట్లు ఆర్‌వోసీ వర్గాలు తెలిపాయి. మాదాపూర్‌లోని కావూరీహిల్స్‌లో ఉన్న టీఎస్‌ఎస్‌ గ్రూప్‌లో 15

క్రిప్టోకరెన్సీ అంటే కఠిన చర్యలు

Tuesday 23rd July 2019

అంతర్‌ మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సు న్యూఢిల్లీ: బిట్‌ కాయిన్‌, ఎథేరియం, రిపిల్‌, కార్డోనో వంటి క్రిప్టోకరెన్సీ  కార్యకలాపాలు ఏవైనా భారత్‌లో కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్‌ మంత్రిత్వశాఖల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేధించాలని సూచించిన కమిటీ, దేశంలో ఈ తరహా కార్యకలాపాలు నిర్వహించే వారిపై జరిమానాలు విధించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. క్రిప్టోకరెన్సీల నియంత్రణ, నిషేధానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలని కూడా కమిటీ

Most from this category