News


ఓబీసీ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు

Friday 10th January 2020
news_main1578628500.png-30819

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ (ఓబీసీ) తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ (ఎంసీఎల్‌ఆర్‌) ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ తగ్గింపు 0.05-0.15 శాతం శ్రేణిలో ఉంది. ప్రామాణిక ఏడాది వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ను 0.15 శాతం తగ్గించడంతో 8.15 శాతానికి చేరినట్లు బ్యాంకు తెలిపింది. ప్రధానంగా కన్జూమర్ రుణాలపై వడ్డీ రేట్లు దీని ఆధారంగానే ఉంటాయి. మరోవైపు, 15 రోజుల నుంచి 6 నెలల దాకా కాలావధికి సంబంధించి ఎంసీఎల్‌ఆర్‌ను 0.05-0.10 శాతం శ్రేణిలో తగ్గించినట్లు ఓబీసీ వివరించింది. 



You may be interested

భారత్‌ బ్యాంకింగ్‌ రుణ వృద్ధి అంతంతే!

Friday 10th January 2020

2019-2020లో వృద్ధిరేటు కేవలం 5 శాతం ప్రపంచబ్యాంక్‌ అంచనా 2020-21లో 5.8 శాతానికి పెరిగే అవకాశం 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధి 2.5 శాతమే! వాషింగ్టన్‌: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌-2020 మార్చి) 5 శాతానికి పడిపోయే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్‌ అంచనావేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-2021)లో వృద్ధిరేటు 5.8 శాతానికి రికవరీ అయ్యే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది. ‘‘బ్యాంకింగ్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌

వచ్చే వారం భారత్‌కు అమెజాన్‌ బెజోస్‌

Friday 10th January 2020

 ప్రధాని మోదీతో భేటీకి అవకాశం న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ వచ్చే వారం భారత్‌ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రభుత్వాధికారులు, పలువురు వ్యాపార దిగ్గజాలతో ఆయన సమావేశమయ్యే అవకాశమున్నట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. జనవరి 15-16న న్యూఢిల్లీలో జరిగే చిన్న, మధ్యతరహా సంస్థల సదస్సు ఎస్‌ఎంభావ్‌ కార్యక్రమంలో బెజోస్ పాల్గోనున్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలపై దేశీయంగా

Most from this category