News


టాటాపై వాడియా కేసు వెనక్కి

Tuesday 14th January 2020
news_main1578972221.png-30900

  • పరువు నష్టం దావా ఉపసంహరణ

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాతో పాటు పలువురిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులను బాంబే డైయింగ్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. రూ. 3,000 కోట్ల నష్టపరిహారం దావా కూడా వీటిలో ఉంది. వాడియా ప్రతిష్టకు భంగం కలిగించే ఉ‍ద్దేశమేదీ లేదని తమకు లేదంటూ టాటా సహా మిగతా వర్గాలు న్యాయస్థానానికి తెలియజేశారు. హైకోర్టు విచారణలో కూడా ఇదే తేలినందున పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవడానికి వాడియాను అనుమతిస్తూ చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే సారథ్యంలోని బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చింది. 2016లో టాటా గ్రూప్ కంపెనీ బోర్డుల నుంచి తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ రతన్ ‍టాటాతో పాటు టాటా సన్స్‌లోని పలువురు డైరెక్టర్లపై వాడియా క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.ఽ దీనిపై 2018 డిసెంబర్ 15న ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు.. టాటా, తదితరులకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశమేదీ లేదంటూ టాటా, తదితరులు ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. దీన్ని సవాల్ చేస్తూ వాడియా సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే, ఇరు వర్గాలు కూర్చుని విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ జనవరి 6న సుప్రీం కోర్టు సూచించింది. దీనికి అనుగుణంగా వాడియా తాజాగా కేసును ఉపసంహరించుకున్నారు. 



You may be interested

నిఫ్టీ తక్షణ మద్దతు 12,298, అవరోధం 12,350

Tuesday 14th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11 పాయింట్లు ప్లస్‌ నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నేటి(13న) ఉదయం  8.40 ప్రాంతం‍లో 11 పాయింట్ల స్వల్ప లాభంతో 12,373 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,362 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. కాగా.. చైనాతో వాణిజ్య వివాద

ద్రవ్యోల్బణం రయ్‌

Tuesday 14th January 2020

- డిసెంబర్‌లో 7.35 శాతానికి  - అయిదున్నరేళ్ల గరిష్టం - కూరగాయల రేట్లే కారణం న్యూఢిల్లీ: ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయిని దాటేసి.. ఏకంగా 7.35 శాతంగా నమోదైంది. ఇది అయిదున్నరేళ్ల గరిష్ట స్థాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2018 డిసెంబర్‌లో

Most from this category