News


సౌర విద్యుత్‌పై ఎన్టీపీసీ దృష్టి

Thursday 26th December 2019
news_main1577329287.png-30439

  • రూ. 50,000 కోట్ల పెట్టుబడి
  • 2022 నాటికి 10 గి.వా. సామర్థ్యం పెంపు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ 2022 నాటికి మరో 10 గిగావాట్ల మేర సౌర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. దీనికోసం రూ. 50,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గ్రీన్ బాండ్స్ ద్వారా ఇందుకు కావాల్సిన నిధులను సమకూర్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సౌర విద్యుత్ సహా ఎన్‌టీపీసీ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 920 మె.వా.గా ఉంది. 2032 నాటికి 130 గి.వా. కంపెనీగా ఎదగాలని ఎన్‌టీపీసీ దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకుంది. ఇందులో 30 శాతం వాటా పునరుత్పాదక విద్యుత్‌దే ఉండనుంది. 


    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 2,300 మె.వా. సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత 2020-21, 2021-22 మధ్య ఏటా 4 గి.వా. మేర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోనున్నట్లు వివరించాయి. 2022 నాటికల్లా పర్యావరణహిత విద్యుదుత్పత్తి సామర్ధ్యాన్ని 175 గి.వా.కు పెంచుకోవాలని కేంద్రం నిర్దేశించుకున్న నేపథ్యంలో ఎన్‌టీపీసీ ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 



You may be interested

మార్చి వరకు అన్ని గ్రామాలకూ ఉచిత వైఫై: ప్రసాద్‌

Thursday 26th December 2019

రేవారి (హర్యానా): భారత్‌నెట్‌ ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలకూ వచ్చే మార్చి వరకు వైఫై ఉచితంగా అందిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం హర్యానాలోని రేవారికి వచ్చిన సందర్భంగా చెప్పారు. ‘‘భారత్‌నెట్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఇప్పటికే 1.3 లక్షల గ్రామ పంచాతీయలకు అనుసంధానించాం. 2.5 లక్షల గ్రామ పంచాయతీలను చేరుకోవాలన్నది లక్ష్యం. భారత్‌నెట్‌ సేవలను ప్రోత్సహించేందుకు గాను ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ 2020 మార్చి వరకు

రిలయన్స్‌ జియోకు అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో విజయం

Thursday 26th December 2019

టవర్ల డీమెర్జర్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేత న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన ఆప్టికల్‌ ఫైబర్‌, టవర్‌ వ్యాపారాలను వేరు చేయడాన్ని (డీమెర్జర్‌) వ్యతిరేకిస్తూ ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రి‍బ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) కొట్టివేసింది. జియో డిజిటల్‌ ఫైబర్‌ ప్రైవేటు లిమిటెడ్‌, రిలయన్స్‌ జియో ఇన్ఫ్రాటెల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన ఫైబర్‌, టవర్‌ వ్యాపారాలను వేరు చేయాలని

Most from this category