News


ఎన్‌టీపీసీ లాభం రూ.3,198 కోట్లు

Saturday 8th February 2020
news_main1581132882.png-31611

  • 23 శాతం వృద్ది 
  • రూ.25,953 కోట్లకు మొత్తం ఆదాయం 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ, ఎన్‌టీపీసీ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.3,198 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ3లో వచ్చిన నికర లాభం, రూ.2,608 కోట్లతో పోల్చితే 23 శాతం వృద్ధి సాధించామని ఎన్‌టీపీసీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.25,677 కోట్ల నుంచి రూ.25,953 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) 77.70 శాతం నుంచి 63.48 శాతానికి తగ్గింది. 

మరిన్ని వివరాలు...
ఇక తొమ్మిది నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలానికి రూ.9,447 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నికర లాభం రూ.7,774 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి రూ.12,633 కోట్ల నికర లాభం వచ్చింది. సగటు విద్యుత్తు చార్జీ ఒక్కో యూనిట్‌కు రూ.3.81గా ఉంది. 



You may be interested

టెక్నో పెయింట్స్‌ మరింత కలర్‌ఫుల్‌

Saturday 8th February 2020

కంపెనీ నుంచి 1,800 నూతన రంగులు రూ.25 కోట్లతో మరో తయారీ కేంద్రం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- పెయింట్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ టెక్నో పెయింట్స్‌ 1,800 రకాల కొత్త రంగులను పరిచయం చేసింది. వీటిలో యాంటీ బాక్టీరియల్‌, ఇన్‌ఫ్రారెడ్‌ రిఫ్లెక్టివ్‌ పెయింట్లు కూడా ఉన్నాయి. దిగ్గజ కంపెనీలకు ధీటుగా కలర్‌ స్పెక్ట్రాను రూపొందించింది. దీని ద్వారా నచ్చిన రంగులు ఎంచుకోవడానికి కస్టమర్లకు మరింత సులువు అవుతుందని టెక్నో పెయింట్స్‌ ఫౌండర్‌

మారుతీ కొత్త ‘ఇగ్నిస్‌’ ఆవిష్కరణ

Saturday 8th February 2020

గ్రేటర్‌ నోయిడా: మారుతీ సుజుకీ ఇండియా... ఇగ్నిస్‌ మోడల్‌లో కొత్త వెర్షన్‌ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఈ తాజా కాంపాక్ట్‌ ఎస్‌యూవీలో 1.2 లీటర్ల బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చింది. కొత్త వెర్షన్‌ 17.78 సెం.మీ స్మార్ట్ ప్లే స్టూడియోతో పాటు లైవ్‌ ట్రాఫిక్‌, డ్రైవర్ భద్రతా హెచ్చరికలు, వెహికిల్‌ సమాచారం వంటి ఫీచర్లు కలిగిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ వివరించారు.

Most from this category