News


ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది

Saturday 7th December 2019
news_main1575691880.png-30106

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది నియమితులయ్యారు. మునుపటి చైర్మన్‌ అశోక్ చావ్లా రాజీనామా తరువాత ఈ ఏడాది జనవరి నుంచి ఈ పోస్ట్‌ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే కాగా, శుక్రవారం చతుర్వేది చైర్మన్‌ బాధ్యతలను స్వీకరించారని ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఇందుకు సెబీ అనుమతి లభించినట్లు ప్రకటించింది. రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శిగా సేవలందించిన ఈయన నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ వెల్లడించింది. 



You may be interested

పసిడి 18డాలర్ల పతనం

Saturday 7th December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 18డాలర్లు నష్టపోయింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించిన నమోదుకావడం పసిడి పతనానికి కారణమైంది. నిన్నరాత్రి అమెరికా నవంబర్‌ మాసపు ఉద్యోగ గణాంకాలు విడుదల చేసింది. ఈ నవంబర్‌లో 1.8లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరగవచ్చని విశ్లేషకలు అంచనా వేశారు. అయితే అంచనాలకు మించి 2.6లక్షల కొత్త ఉద్యోగ సృష్టి జరిగింది. ఈ ఏడాది జనవరి తరువాత అత్యధికంగా ఉద్యోగ కల్పన జరగడం ఇదే తొలిసారి.

విదేశీ పెట్టుబడుల వివరాలు ఏటా చెప్పాలి

Saturday 7th December 2019

ఈ-కామర్స్ సంస్థలకు కొత్త నిబంధన న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థలు ఇకపై తమకు అందే విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించిన వివరాలను .. ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం తెలియజేయాల్సి రానుంది. తాము ఎఫ్‌డీఐ నిబంధనలను సక్రమంగా అమలు చేస్తున్నామంటూ ఏటా సెప్టెంబర్ 30లోగా ఆడిటర్‌ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిబంధనను కేంద్రం శుక్రవారం నోటిఫై చేసింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలపై దీని ప్రభావం ఉంటుంది. ఈ-కామర్స్

Most from this category