STOCKS

News


దేశీ ఆదాయంపైనే పన్ను

Monday 3rd February 2020
news_main1580701752.png-31453

  • ఎన్‌ఆర్‌ఐ టాక్స్‌పై ఆర్థిక శాఖ వివరణ
  • గల్ఫ్‌ దేశాలు, మర్చంట్ నేవీలో పనిచేసే వారికి ఊరట

న్యూఢిల్లీ:  ప్రవాస భారతీయుల (ఎన్నారై) ఆదాయాలపై పన్ను విధించే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. ఎన్నారైలు భారత్‌లో ఆర్జించిన ఆదాయాలపై మాత్రమే దేశీయంగా పన్ను విధింపు ఉంటుందని వివరణ ఇచ్చారు. ఇతర దేశాల్లో వారికి వచ్చే ఆదాయాలపై ట్యాక్స్ విధించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. "ఎన్నారైలకు భారత్‌లో వచ్చిన ఆదాయాలపై మాత్రమే ఇక్కడ పన్ను ఉంటుంది. పన్నుల ప్రస్తావన లేని దేశాల్లో వారు ఆర్జించిన ఆదాయంపై ఇక్కడ ట్యాక్స్‌ విధించం" అని ఆదివారం విలేకరులతో ఆమె తెలిపారు. ఉదాహరణకు భారత్‌లో ప్రాపర్టీ ద్వారా ఎన్నారైలకు వచ్చే అద్దె ఆదాయాలు మొదలైన వాటిపైనే పన్ను ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, ఎన్నారై హోదాను అడ్డం పెట్టుకుని కావాలని భారత్‌లో పన్నులు ఎగ్గొట్టే వారిని కట్టడి చేసేందుకే నిర్దిష్ట చట్టాన్ని కఠినతరం చేసినట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఆదాయ పన్ను విధించని ఇతర దేశాల్లో పనిచేసే భారతీయులకు, మర్చంట్‌ నేవీలో పనిచేసే వారికి దీన్నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. దీంతో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులకు ఊరటనిచ్చినట్లయింది.   

 
   ఇతరత్రా ఏ దేశంలోను ఆదాయ పన్నులు చెల్లించని ఎన్నారైలపై దేశీయంగా ట్యాక్స్‌ విధించేలా 2020-21 బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రతిపాదన చేశారు. అలాగే ఎన్నారై హోదా పొందాలంటే సదరు వ్యక్తి ఓ సంవత్సరంలో విదేశాల్లో ఉండాల్సిన వ్యవధిని 183 రోజుల నుంచి 245 రోజులకు పెంచారు. ఆదాయ పన్ను విధించని గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల్లో ఈ నిబంధనలు ఆందోళన రేకెత్తించాయి. దీంతో కేంద్రం తాజా వివరణనిచ్చింది. "చట్టాల్లో లొసుగులు దుర్వినియోగం కాకుండా చూసేందుకే కొత్త నిబంధనలు చేర్చడం జరిగింది. అంతే తప్ప విదేశాల్లో పనిచేస్తున్న వారి ఆదాయాలపై పన్నులు విధించే ఉద్దేశం లేదు. బడ్జెట్‌ ప్రతిలో ఉపయోగించిన పదాలే ఈ గందరగోళానికి దారి తీసి ఉండొచ్చు" అని రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే పేర్కొన్నారు. ఒకవేళ కొత్త నిబంధనల వల్ల ఇబ్బందులు ఎదురైన పక్షంలో వాటిని పునఃపరిశీలిస్తామని తెలిపారు.



You may be interested

పన్ను వసూళ్ల లక్ష్యం కుదింపు

Monday 3rd February 2020

కొత్త శ్లాబ్‌లు ట్యాక్స్‌పేయర్లకు ప్రయోజనకరమే సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీ వెల్లడి న్యూఢిల్లీ: వివిధ ఆర్థిక అంశాల వాస్తవిక స్థితిగతులను మదింపు చేసిన మీదట కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని దిగువముఖంగా రూ. 11.80 లక్షల కోట్లకు సవరించినట్లు సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ పీసీ మోదీ వెల్లడించారు. "2019-20లో వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయ పన్ను మొదలైన ప్రత్యక్ష పన్నుల వసూళ్లను రూ. 13.35 లక్షల

నేడు సానుకూల ఓపెనింగ్‌- తదుపరి?!

Monday 3rd February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు ప్లస్‌ శుక్రవారం యూఎస్‌ మార్కెట్ల పతనం ప్రస్తుతం కుప్పకూలిన చైనీస్‌ షాంఘై ఇండెక్స్‌ నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 32 పాయింట్లు పుంజుకుని 11,686  వద్ద ట్రేడవుతోంది. శనివారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 11,654 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి

Most from this category