News


ఎయిరిండియాలో 49 శాతంగానే విదేశీ ఎయిర్‌లైన్స్‌ వాటాలు..

Thursday 5th March 2020
news_main1583379069.png-32286

భారీ రుణాలు, నష్టాల భారంతో అమ్మకానికి వచ్చిన ఎయిరిండియాలో ఎన్నారైల పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో విదేశీ ఎయిర్‌లైన్స్ సహా ఇతరత్రా విదేశీ సంస్థలు.. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎయిరిండియాలో 49 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేయడానికి ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా ఎయిరిండియా నియంత్రణాధికారాలు భారతీయుల చేతుల్లోనే ఉండేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఇతరత్రా ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్‌లో ఎన్నారైలు ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం వాటాలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఎయిరిండియాలో మాత్రం 49 శాతానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి.  ఎయిరిండియా విషయంలో ఇదొక మైలురాయిలాంటి నిర్ణయంగా జవదేకర్ చెప్పారు. కంపెనీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లినా.. ప్రయాణికులకు యథాప్రకారం మెరుగైన సేవలు అందిస్తుందని, పెట్టుబడి అవకాశాలు పెంచుకోగలదని ఆయన తెలిపారు. 



You may be interested

15 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబైన ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ

Thursday 5th March 2020

నేటితో ముగియనున్న ఐపీఓ  న్యూఢిల్లీ: ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మూడో రోజు 15 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. నేటి(గురువారం)తో ముగియనున్న ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ రూ.750-755గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.10,300 కోట్ల మేర నిధులు సమీకరిస్తుందని అంచనా. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు(క్విబ్‌)కు కేటాయించిన వాటా 57 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 2 రెట్లు, రిటైల్‌

విదేశాల్లో నేరుగా లిస్టింగ్‌..!

Thursday 5th March 2020

దేశీ సంస్థలకు అవకాశం ఎయిరిండియాలో ఎన్నారైలకి  100% వాటాలకు అనుమతులు కంపెనీల చట్టంలో 72 సవరణలు క్యాబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు విదేశీ ఎక్స్చేంజీల్లో నేరుగా లిస్టయ్యే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందుకు అనుగుణంగా కంపెనీల చట్టం, 2013కి సవరణలు చేయనుంది. మరోవైపు, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ప్రవాస భారతీయులు (ఎన్నారై) 100 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన

Most from this category