News


రూపే కార్డులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు తగ్గింపు

Saturday 14th September 2019
news_main1568435674.png-28366

ముంబై: రూపే డెబిట్‌ కార్డు లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును క్రమద్ధీకరించినట్టు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ప్రకటించింది. అక్టోబర్‌ 20 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌), ఈకామ్‌, భారత్‌క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత మర్చంట్‌ లావాదేవీలపై రేట్లను క్రమబద్ధీకరించినట్టు వివరించింది. రూ.2,000కు పైన ఉండే లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ చార్జీని 0.60 శాతానికి సవరించామని, గరిష్టంగా రూ.150గానే ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం రూ.2,000పైన లావాదేవీలపై 0.90 శాతం వరకు అంటే గరిష్టంగా రూ.1,000 వరకు ఉండేది. ఇక క్యూఆర్‌ లావాదేవీలపై చార్జీని 0.50 శాతానికి తగ్గించింది. గరిష్ట చార్జీ రూ.150. 



You may be interested

విలీనానికి ఆంధ్రా బ్యాంక్‌ ఓకే

Saturday 14th September 2019

ఆమోదం తెలిపిన డైరెక్టర్ల బోర్డ్‌  హైదరాబాద్‌: యూనియన్‌ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఆంధ్రా బ్యాంక్‌ వెల్లడించింది. యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌తో పాటు కార్పొరేషన్‌ బ్యాంక్‌ కూడా విలీనమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ రెండు బ్యాంక్‌లను విలీనం చేసుకోవడానికి ఇటీవలనే యూనియన్‌ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌  కూడా ఆమోదం

20న జీఎస్‌టీ మండలి సమావేశం

Saturday 14th September 2019

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశం వచ్చే శుక్రవారం (20వ తేదీన) గోవాలో జరగనుంది. కార్ల నుంచి బిస్కెట్ల వరకూ ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని వస్తున్న డిమాండ్లపై ఈ అత్యున్నత స్థాయి జీఎస్‌టీ సమావేశం దృష్టి సారించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను తగ్గింపుల వల్ల ప్రభుత్వ ఆదాయాలపై ప్రత్యక్షంగా ఎటువంటి ప్రభావం పడుతుందన్న విషయాన్ని మండలి సమీక్షిస్తుందని తెలుస్తోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగే

Most from this category