News


ఎస్‌బీఐ నుంచి డెబిట్‌కార్డ్‌ ఈఎంఐ 

Tuesday 8th October 2019
news_main1570508077.png-28763

ముంబై: పండుగల సమయంలో ఎస్‌బీఐ తన కస్టమర్లకు డెబిట్‌ కార్డుపైనా ఈఎంపై సదుపాయాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 1500కు పైగా పట్టణాల్లోని స్టోర్లలో ఉన్న 4.5 లక్షల పైన్‌ల్యాబ్స్‌ బ్రాండ్‌ పీవోఎస్‌ మెషిన్ల వద్ద డెబిట్‌ ద్వారా ఈఎంఐ కింద కొనుగోళ్లు చేసుకోవచ్చని ఎస్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. 6 నెలల నుంచి 18 నెలల కాలానికి చెల్లించే ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. డాక్యుమెంటేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజులు ఉండవని, ఇందుకోసం బ్యాంకు శాఖలకు రావాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ తెలిపింది. ఎంపిక చేసిన బ్రాండ్లపై జీరో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉన్నట్టు పేర్కొంది. ఎస్‌బీఐ కస్టమర్లు తమ డెబిట్‌ కార్డుపై ఈఎంఐ సదుపాయం ఉందా, లేదా అన్నది తెలుసుకునేందుకు DCEMI అని టైప్‌ చేసి 567676కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. 
 



You may be interested

మైక్రోసాప్ట్‌కు ‘యస్‌’.. ?

Tuesday 8th October 2019

15 శాతం వాటా విక్రయం  రూ.2,000 కోట్ల నిధులు  మైక్రోసాఫ్ట్‌కు డైరెక్టర్‌ పదవి  ఈ వార్తలపై వ్యాఖ్యానించబోమన్న ఇరు సంస్థలు  న్యూఢిల్లీ: తాజాగా పెట్టుబడులు సమకూర్చుకోవడం,  డిజిటల్‌ కార్యకలాపాల జోరును మరింత పెంచుకోవడం లక్ష్యంగా వ్యూహాత్మక భాగస్వామి కోసం యెస్‌ బ్యాంక్‌ అన్వేషిస్తోందని సమాచారం. దీంట్లో భాగంగా మైక్రోసాప్ట్‌ కార్పొరేషన్‌తో పాటు మరో రెండు అగ్రశ్రేణి దిగ్గజ కంపెనీలతో ఈ బ్యాంక్‌ సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం...,

నిఫ్టీ చార్టులో సెల్‌ సిగ్నల్‌!

Tuesday 8th October 2019

నిఫ్టీ సోమవారం తీవ్ర అస్థిరతల మధ్య పై స్థాయిలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా కానీ సఫలం కాలేదు. చివర్లో అమ్మకాల కారణంగా సూచీలు నష్టపోయాయి. ముఖ్యంగా సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాలపై ఆందోళనలు తాజా అమ్మకాలకు కారణమయ్యాయి. అయితే, నిఫ్టీ వరుసగా ఆరో రోజూ తక్కువ స్థాయిల్లో క్లోజయింది. తద్వారా డైలీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పాటు చేసిందని నిపుణులు చెబుతున్నారు.    నిఫ్టీ 11,196 వద్ద ప్రారంభమై 200 రోజుల సగటు ఈఎంఏ(11,218)ను అధిగమించేందుకు

Most from this category