News


ఇక రిటైల్‌లోనూ 59 నిమిషాల్లో...

Friday 6th September 2019
news_main1567740560.png-28225

  • వ్యక్తిగత, గృహ రుణాలు ఇకపై
  • మరింత సులభతరం
  • త్వరలో ఆటో పరిశ్రమకు విస్తరణ
  • ఇప్పటి వరకూ చిన్న పరిశ్రమలకే ఈ ప్రయోజనం

న్యూఢిల్లీ: ‘59 నిమిషాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) రుణాలు’ పోర్టల్‌ సేవలు రిటైల్‌ రుణాలకూ విస్తరించడం జరిగింది. రిటైల్‌ రుణ లభ్యతకూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. గృహ, వ్యక్తిగత రుణ ప్రతిపాదనలకు ఈ పోర్టల్‌ ఇకపై అందుబాటులో ఉండనుంది. త్వరలో ఆటో రుణాలకు సంబంధించి కూడా అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు తెలపాయి.  ఇప్పటి వరకూ ఈ సేవలు లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) మాత్రమే అందుబాటులో ఉంది. 2018 నవంబర్‌లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది.  ఎంఎస్‌ఎంఈలకు  కోటి రూపాయల వరకూ ఈ పోర్టల్‌ ద్వారా రుణం పొందే సౌలభ్యం ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్స్‌ నుంచి బ్యాంక్‌ అకౌంట్ల వరకూ అందుబాటులోఉన్న పలు  ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్లను పరిశీలనలోకి తీసుకుని వచ్చే డేటా పాయింట్లను అత్యుధునిక ఆల్గోరిథమ్స్‌ ద్వారా విశ్లేషించి తక్షణ రుణ లభ్యత కల్పించడం ఈ పోర్టల్‌ ముఖ్య ఉద్దేశం. 2019 మార్చి 31వ తేదీ వరకూ అందిన గణాంకాల ప్రకారం- ఈ రుణాల కోసం 50,706 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 27,893 ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. 



You may be interested

భారత ఈ-కామర్స్‌లోకి యూసీవెబ్‌

Friday 6th September 2019

న్యూఢిల్లీ: చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ తాజాగా భారత ఈ-కామర్స్‌ వ్యాపార విభాగంలో ప్రవేశించాలని యోచిస్తోంది. అనుబంధ సంస్థ యూసీవెబ్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. యూసీవెబ్ గ్లోబల్ బిజినెస్ వైస్‌ ప్రెసిడెంట్ హుయాన్‌ యాంగ్ ఈ విషయాలు తెలిపారు. అయితే, ఈ-కామర్స్‌ విభాగంలోకి తమ ఎంట్రీతో పేటీఎంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆయన చెప్పారు. ఈ-కామర్స్‌ చాలా విస్తృతమైనదని, తమకు అనుకూల

ఆగస్ట్‌లో 10వేల ఉద్యోగాలకు నష్టం

Friday 6th September 2019

వాణిజ్య యుద్ధంతో అమెరికాలో పరిస్థితి వాషింగ్టన్‌: చైనాతో అమెరికా వాణిజ్య పోరు అగ్ర దేశంలో ఉద్యోగాలకు గండి కొడుతోంది. ఆగస్ట్‌ నెలలో ఏకంగా 10,000కు పైగా ఉగ్యోగులను కేవలం  వాణిజ్య యుద్ధంతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగానే అమెరికన్‌ కంపెనీలు తొలగించుకోవాల్సి వచ్చినట్టు గ్రే అండ్‌ క్రిస్‌మస్‌ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు 2009 ఆగస్ట్‌ తర్వాత... ఇంతగా ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది ఆగస్ట్‌లోనే జరిగినట్టు గ్రే అండ్‌ క్రిస్‌మస్‌ సంస్థ

Most from this category