News


మిశ్రమంగా నవంబర్‌ వాహన విక్రయాలు

Monday 2nd December 2019
news_main1575256666.png-29988

న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగం మందగమనంలో ప్రయాణిస్తోంది. ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు గతనెల్లో కూడా అంతంత మాత్రంగా నమోదైయ్యాయి. నూతన ఆవిష్కరణలు కొనసాగినా, ఆశించిన స్థాయిలో అమ్మకాలు పుంజుకోలేకపోయాయి. టాటా మోటార్స్‌, హోండా కార్స్‌ విక్రయాల్లో భారీ క్షీణత కొనసాగగా.. మారుతీ సుజుకీ అమ్మకాల్లో స్వల్పంగా 1.6 శాతం తగ్గుదల నమోదైంది. హ్యుందాయ్‌ మాత్రం 2 శాతం వృద్ధిని నమోదుచేసింది. ఈ సారి కూడా క్షీణత ఉన్నప్పటికీ.. అంతక్రితం నెలలతో పోల్చితే ఆటో రంగం కాస్త గాడిన పడిన సంకేతాలు కనిపిస్తున్నాయని ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు.

 



You may be interested

లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

Monday 2nd December 2019

6 శాతం వృద్ధి  మూడు నెలల తర్వాత లక్ష కోట్లపైకి  న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు గత నెలలో రూ. లక్ష కోట్లను దాటాయి. జీఎస్‌టీ వసూళ్లు మూడు నెలల తర్వాత లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే. గత ఏడాది నవంబర్‌లో రూ.97,637 కోట్లు, (ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.95,380 కోట్లుగా) ఉన్న జీఎస్‌టీ వసూళ్లు ఈ ఏడాది నవంబర్‌లో 6 శాతం వృద్ధితో రూ.1.03 లక్షల కోట్లకు

సెన్సెక్స్‌ మద్దతు శ్రేణి 40,000–40,600

Monday 2nd December 2019

అమెరికా–చైనాల ట్రేడ్‌డీల్‌పై పరస్పర విరుద్ధ సంకేతాలు వెలువడటంతో గతవారం అమెరికాతో సహా అన్ని ప్రపంచ ప్రధాన స్టాక్‌ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, భారత్‌ మార్కెట్‌లో రికార్డుల హోరు కొనసాగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మన మార్కెట్‌ ముగిసిన తర్వాత వెలువడిన జీడీపీ డేటా తీవ్ర నిరుత్సాహాన్ని కల్గించింది. అయినా, ఈ అంశాన్ని ఇప్పటికే మార్కెట్‌ చాలావరకూ డిస్కౌంట్‌ చేసుకున్నందున, సమీప భవిష్యత్‌లో అంతర్జాతీయ పరిణామాలే ఈక్విటీలను నడిపించవచ్చని అధికశాతం

Most from this category