తొమ్మిది బ్యాంకులను మూసివేత... పుకార్లే!
By Sakshi

ముంబై: తొమ్మిది వాణిజ్య బ్యాంకులు మూతపడబోతున్నాయంటూ... సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని అటు కేంద్రం ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం స్పష్టం చేశాయి. వీటిలో ఏ మాత్రం నిజం లేదని ఫైనాన్స్ కార్యదర్శి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. పైగా మరింత మూలధనం సమకూర్చి ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టం చేయడానికి కేంద్రం తగిన అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు. ఆర్బీఐ కూడా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, ఒక ప్రకటన జారీ చేసింది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ)పై ఆర్బీఐ చర్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘బ్యాంకుల మూసివేత’ ప్రచారం షికార్లు చేసింది.
You may be interested
9 శాతం వృద్ధి సవాలే: నీతి ఆయోగ్
Thursday 26th September 2019ఇంధన రంగానిదే కీలకమన్న సీఈఓ అమితాబ్ కాంత్ న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8 నుంచి 9 శాతం సాధించడం కేంద్రం ముందు ఉన్న ఒక సవాలని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. వృద్ధి సాధన, అదే స్థాయిలో దానిని నిలబెట్టుకోవడం కీలకమని అన్నారు. ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన ఆర్థికాభివృద్ధి రేటును తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కాంత్ తాజా
పెట్రోల్ బంకుల్లో క్రెడిట్‌కార్డుపై క్యాష్‌బ్యాక్ ఉండదిక..!
Thursday 26th September 2019డీమోనిటైజేషన్ తర్వాత 0.75 శాతం క్యాష్‌బ్యాక్ అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డులపై నిలిపివేత డెబిట్ కార్డు, వ్యాలెట్ చెల్లింపులపై కొనసాగింపు న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల్లో ఇక క్రెడిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై అక్టోబర్ 1 నుంచి 0.75 శాతం క్యాష్‌బ్యాక్ ఉండబోదు. డీమోనిటైజేషన్ తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకుగాను కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగుణంగా... ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు (బీపీసీఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్) ఇంధనం కోసం చేసే డిజిటల్ చెల్లింపులపై