News


‘నార్డిక్‌’ దిశగా మన ఐటీ నావ!

Friday 10th January 2020
news_main1578628031.png-30816

  • హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌లకు ఇప్పటికే నార్డిక్‌ దేశాల్లో కార్యకలాపాలు
  • కేంద్రాలను ఏర్పాటు చేయనున్న టెక్‌ మహీంద్రా, విప్రో
  • ఇంగ్లిష్‌ భాషా పరంగా అనుకూలత, నిపుణుల లభ్యత
  • కలిసొస్తున్న ప్రభుత్వ విధానాలు, ఇతర సానుకూలతలు

న్యూఢిల్లీ: మన దేశ ఐటీ కంపెనీల చూపు నార్డిక్‌ దేశాల వైపు మళ్లింది. నార్డిక్‌ దేశాలుగా పిలిచే ఫిన్లాండ్‌, స్వీడన్‌, నార్వే, డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌ల్లో ప్రముఖ ఐటీ కంపెనీలు కార్యాలయాలను తెరిచేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. యూరోప్‌లో ఈ దేశాలు ప్రధానంగా ఇంగ్లిష్‌ భాషా ఆధారితమైనవి కావడం మన కంపెనీలను ఆకర్షిస్తోంది. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) పరిధిలో ఇతర దేశాలతో పోలిస్తే ఈ దేశాల్లో కార్యకలాపాలకు భాషా పరమైన సమస్యల్లేకపోవడం వాటికి సౌకర్యాన్నిస్తోంది. దీంతో పదేళ్ల క్రితమే హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అక్కడ పాగా వేయగా, ఇటీవలి కాలంలో విప్రో, టెక్‌ మహీంద్రా కూడా ఫిన్లాండ్‌లో కార్యాలయాలు తెరవనున్నట్టు ప్రకటించాయి. మరో సంస్థ ఇన్ఫోసిస్‌ 2018లో ఫ్లూడో అనే కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా నార్డిక్‌ మార్కెట్లోకి ‍ప్రవేశించింది. స్థానిక కంపెనీలతో కలసి కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఎన్నో అనుకూలతలు...
ముఖ్యంగా నార్డిక్‌ దేశాల్లో అధిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత నెలకొంది. దీంతో ఈ దేశాలు ఈయూ నిబంధనలకు కట్టుబడి ఉన్నప్పటికీ, విదేశీ నిపుణుల ప్రవేశానికి సులభంగానే అనుమతిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో స్వేచ్ఛా విధానాలు, బలమైన ఆర్థిక, సామాజిక అంశాలు.. అన్నీ కలసి ఈ దేశాలు మన కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. ‘‘యూరోప్‌లో నార్డిక్‌ ప్రాంతం ఎంతో ప్రగతిదాయక, వినూత్నమైనది. ఎన్నో ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు.. చిప్‌ మేకర్లు, సెమీ కండక్టర్‌ కంపెనీలు, ఎక్విప్‌మెంట్‌ తయారీదారులు, సర్వీస్‌ ప్రొవైడర్లు అక్కడ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు కలిగి ఉన్నాయి. భవిష్యత్తు సమాచార వ్యవస్థ, టెక్నాలజీని అర్థం చేసుకునే నాణ్యమైన పనివారు ఉండడంతో ఆ ప్రాంతంలో కేంద్రం ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అవుతుంది’’ అని టెక్‌ మహీంద్రా సీఎస్‌వో జగదీష్‌ మిత్రా తెలిపారు. మౌలిక, నిర్మాణ, ఇంజనీరింగ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ అనుబంధ సంస్థ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ) యూరోప్‌లో కార్యకలాపాలను విస్తరించాలనుకుప్పుడు ముందుగా నార్డిక్‌ దేశాల వైపే అడుగులు వేసింది. ‘‘నార్డిక్స్‌ ఐటీ, బీపీవో సేవల మార్కెట్‌ పరిమాణం 25 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. అవుట్‌సోర్స్‌ (బయటకు పని ఇచ్చేయడం) పరంగా పెద్ద మార్కెట్‌ కావడంతోపాటు ఆవిష్కరణల్లో ముందుండడమే అక్కడ మా పెట్టుబడులు, విస్తరణకు కారణం’’ అని ఎల్‌టీఐ ప్రెసిడెంట్‌ సుధీర్‌ చతుర్వేది తెలిపారు. పోలండ్‌లోని కేంద్రం ద్వారా నార్డిక్‌ ప్రాంతానికి ఎల్‌ఐటీ సేవలను అందిస్తోంది. స్వీడన్‌కు చెందిన హోయిస్ట్‌ ఫైనాన్స్‌ ఏబీ నుంచి ఇటీవలే మల్టీ మిలియన్‌ డాలర్ల కాంట్రాక్టును సైతం ఎల్‌ఐటీ సొంతం చేసుకుంది. 
అనుసంధానత ఎక్కువే...
ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఆటోమేషన్‌, క్లౌడ్‌ తదితర డిజిటల్‌ టెక్నాలజీలు ప్రధానంగా ఐటీ కంపెనీల వృద్ధికి ఇటీవలి కాలంలో దోహదపడుతున్నాయి. దీంతో నార్డిక్‌ ప్రాంతానికి భారత్‌ ముఖ్య నైపుణ్య వనరుగా అతరించింది. ‘‘కేవలం నార్డిక్స్‌ వరకే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌ అనుసంధానత కూడా కంపెనీలకు అక్కడ లభిస్తుంది. 5జీ, 6జీ కనెక్టివిటీతోపాటు, టెలికం, హెల్త్‌కేర్‌ వంటి రంగాల్లో ఎంతో పరిశోధన, అభివృద్ధి జరిగింది’’ అని బిజినెస్‌ ఫిన్లాండ్‌ భారత దేశ మేనేజర్‌ జుక్కా హోలప్ప పేర్కొన్నారు. ఎల్‌అండ్‌టీకి చెందిన మరో అనుబంధ సంస్థ ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ నార్డిక్‌ ప్రాంతంలోని ముఖ్యమైన కస్టమర్లతో కలసి పనిచేయడం ప్రారంభించగా, ఆ తర్వాత ఎంతో మంది కస్టమర్లకు తన సేవలను విస్తరించింది. నేడు ఆ ప్రాంతంలో అతిపెద్ద ఇంజనీరింగ్‌ సేవల కంపెనీగా అవతరించడం గమనార్హం. You may be interested

శుక్రవారం వార్తల్లోని స్టాక్స్‌

Friday 10th January 2020

అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఉపశమించిన నేపథ్యంలో గురువారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. దేశీయంగా సెన్సెక్స్‌ 635 పాయింట్లు జంప్‌చేసి 41,452కు చేరగా.. నిఫ్టీ సైతం 191 పాయింట్లు ఎగసి 12,216 వద్ద ముగిసింది. ఇక యూఎస్‌ మార్కెట్లు 0.7 శాతం బలపడటం ద్వారా సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు ‍స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అయ్యే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు

అపోలో మ్యునిక్‌ ఇకపై హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో హెల్త్‌

Friday 10th January 2020

కొనుగోలును పూర్తి చేసిన హెచ్‌డీఎఫ్‌సీ న్యూఢిల్లీ: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సేవల్లో ఉ‍న్న అపోలో మ్యునిక్‌ కొనుగోలును ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ పూర్తి చేసింది. ఈ సంస్థలో అపోలో హాస్పిటల్స్‌ గ్రూపునకు ఉన్న 50.80 శాతం వాటాను రూ.1,485 కోట్లకు, అలాగే, ఉద్యోగుల వద్దనున్న 0.36 శాతం వాటాను రూ.10.67 కోట్లకు కొనుగోలు చేసింది. అపోలో మ్యునిక్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు నియంత్రణ సంస్థల ఆమోదం లభించడంతో ఈ లావాదేవీని పూర్తి

Most from this category