News


నోకియా 2.3 వచ్చేసింది

Thursday 19th December 2019
news_main1576729452.png-30302

  • ధర రూ. 8,199

న్యూఢిల్లీ: ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా బ్రాండ్‌ హ్యండ్‌సెట్స్‌ విక్రయ సంస్థ హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌... బుధవారం భారత మార్కెట్లో నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ నెల్లోనే తొలుత ఈజిప్ట్‌ రాజధాని కైరోలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించిన సంస్థ.. తాజాగా భారత మార్కెట్లోకి ఫోన్‌ను తీసుకొచ్చింది. కొత్త ఫోన్‌ 6.2 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. 2జీబీ/32జీబీ వేరియంట్‌ ధర రూ. 8,199గా కంపెనీ ప్రకటించింది. నూతన మోడల్‌కు ఏడాది రీప్లేస్‌మెంట్‌ గ్యారెంటీ ఉంది. 



You may be interested

ట్రంప్‌ అభిశంసనకు హౌస్‌ ఆమోదం

Thursday 19th December 2019

వచ్చే నెల్లో సెనెట్‌లో చర్చ దిగిపోయే అవకాశాలు తక్కువే.. అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌ అధ్యక్షుడు ట్రంప్‌ అభిశంసనకు అనుకూలంగా ఓటేసింది. అధికార దుర్వినియోగ ఆరోపణలపై ట్రంప్‌ను సభ అభిశంసించింది. హౌస్‌ ఆమోదం అనంతరం ఈ తీర్మానం సెనెట్‌లో చర్చకు రానుంది. సెనెట్‌లో కూడా తీర్మానం ఆమోదం పొందితే ట్రంప్ పదవి నుంచి వైదొలగాల్సిఉంటుంది. కానీ సెనెట్‌లో రిపబ్లికన్లకు ఉన్న మెజార్టీ దృష్ట్యా ట్రంప్‌ పదవికి తక్షణ ముప్పేమి ఉండదని రాజకీయ విశ్లేషకుల

మార్కెట్లోకి పియాజియో ‘ఏప్‌ ఈ–సిటీ’

Thursday 19th December 2019

న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన దిగ్గజ వాహన తయారీ కంపెనీ పియాజియో.. భారత ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. ‘ఏప్‌ ఈ–సిటీ’ పేరిట ఎలక్ట్రిక్‌ త్రీ–వీలర్‌ను బుధవారం విడుదల చేసింది. లిథియం– అయాన్‌ బ్యాటరీ కలిగిన దీని ధర రూ. 1.97 లక్షలుగా(ఎక్స్‌–షోరూం) ప్రకటించింది. మూడేళ్ల వారెంటీతో వస్తున్న ఈ వాహనాన్ని సన్‌ మొబిలిటీ భాగస్వామ్యంతో మొదటి దశలో చండీగఢ్, మొహాలి, గురుగ్రామ్‌లలో అందుబాటులోకి తెస్తోంది. 

Most from this category