News


బ్యాంకింగ్‌ ఆందోళనకరం: అభిజిత్‌ బెనర్జీ

Wednesday 23rd October 2019
news_main1571805555.png-29073

భారత్‌ బ్యాంకింగ్‌ సంక్షోభ పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనడానికి తగిన పటిష్ట చర్యలు అవసరమని ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 50 శాతం దిగువకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల అధికారులు కొంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతారని విశ్లేషించారు. 

ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభం వస్తే కష్టమే!
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలో సంక్షోభం నెలకొంటే బ్యాంకింగ్‌కు 2020-21 నాటికి రూ.3.5 లక్షల కోట్ల (50 బిలియన్‌ డాలర్లు) మూలధన కొరత ఏర్పడుతుందని గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ- ఫిచ్‌ అధ్యయనం ఒకటి తేల్చింది. ‘‘ఎన్‌బీఎఫ్‌సీ రంగం సంక్షోభ పరిస్థితుల్లోకి వెళితే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ విభాగం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. ‘బీ’ శ్రేణిలో ఒయబిలిటీ (సామర్థ్యం) రేటింగ్స్‌సహా బ్యాంకింగ్‌ రుణ విభాగం బలహీనమవుతుంది. ప్రభుత్వం నుంచి తాజా మూలధనం లభించని పక్షంలో దివాలా పరిస్థితులనూ ఎదుర్కొనాల్సి వస్తుంది’’ అని ఫిచ్‌ నిర్వహించిన ఒక అధ్యయనం విశ్లేషించింది. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకింగ్‌ రుణాలకు సంబంధించి 30 శాతం మొండిబకాయిలుగా (ఎన్‌పీఏ) మారే అవకాశం ఉందని కూడా ఫిచ్‌ అధ్యయనం పేర్కొనడం గమనార్హం. బ్యాంకింగ్‌ వ్యవస్థ స్థూల ఎన్‌పీఏ నిష్పత్తి 2018-19లో 9.3 శాతం ఉంటే, ఇది 2020-21లో 11.6 శాతానికి పెరిగే అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది. రుణ వ్యయాలు పెరగడం, బలహీన ఆర్థిక పరిస్థితులు దీనికి కారణమనీ విశ్లేషించింది. 



You may be interested

స్వల్ప నష్టంతో రూపీ ప్రారంభం

Wednesday 23rd October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం సెషన్లో 6 పైసలు బలహీనపడి 71 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా పాక్షిక ఒప్పందం ఖరారవుతుందనే అంచనాలుండడంతో పాటు, చమురు ధరలు పడిపోతుండడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో రెండు వారాల గరిష్టమయిన 70.94 వద్ద ముగిసింది. గత సెషన్లో అక్టోబర్‌ ఎన్‌ఎస్‌ఈ డాలర్‌-రూపీ కాంట్రాక్ట్‌ 71.0 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 0.43 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డెరక్ట్‌

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Wednesday 23rd October 2019

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఆటో, హీరో మోటొకార్ప్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బయోకాన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఆర్తి డ్రగ్స్‌, హావెల్స్‌ ఇండియా, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌, టెక్స్‌మాకో రైల్‌, షాపర్స్‌ స్టాప్‌, జీ మీడియా, జేఎమ్‌ ఫైనాన్షియల్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌. 

Most from this category