News


ఎఫ్‌పీఐలపై కక్షేమీ లేదు..

Wednesday 10th July 2019
news_main1562741689.png-26948

  •  కావాలంటే కంపెనీ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు
  • అధిక పన్నుభారంపై ఆర్థిక శాఖ వివరణ

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో అత్యంత సంపన్నులకు పన్ను భారం పెంచే ప్రతిపాదనలపై విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో కేంద్రం స్పందించింది. ఇది ప్రత్యేకంగా ఎఫ్‌పీఐలే లక్ష్యంగా చేసిన ప్రతిపాదన కాదని, విదేశీ ఇన్వెస్టర్లు కావాలంటే కార్పొరేట్‌ సంస్థ కింద నమోదు చేయించుకుని, తక్కువ పన్ను రేట్ల ప్రయోజనాలను పొందవచ్చని వివరణనిచ్చింది. "ఎఫ్‌పీఐలపైనే సర్‌చార్జీ పెంచడం ద్వారా వారినే ప్రభుత్వం టార్గెట్‌గా చేసుకుందని చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇది పూర్తిగా అబద్ధం. దేశీ ఇన్వెస్టర్లయినా.. విదేశీ ఇన్వెస్టర్లయినా ఎఫ్‌పీఐలు, ఎఫ్‌ఐఐలు అత్యంత సంపన్నులు ఏ కేటగిరీకి చెందినవారైనా ఈ సర్‌చార్జీ వర్తిస్తుంది. దేశ, విదేశీ సంస్థలపై మాత్రం దీన్ని విధించలేదని గమనించాలి" అని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
    అత్యంత సంపన్నుల ఆదాయపు పన్నుపై సర్‌చార్జీని పెంచుతూ కేంద్రం తాజా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వర్తించే గరిష్ట పన్ను 42.74 శాతం దాకా పెరిగింది. ట్రస్టులు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్‌ (ఏవోపీ) తదితర కార్పొరేట్‌యేతర సంస్థల రూపంలో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌పీఐల్లో దాదాపు 40 శాతం ఇన్వెస్టర్లు ఆటోమేటిక్‌గా ఈ ప్రతిపాదన పరిధిలోకి వస్తారు. దీంతో ఎఫ్‌పీఐల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి అంశాల కారణంగానే సోమవారం దేశీ స్టాక్‌మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తి సూచీలు భారీగా నష్టపోయాయి. 

స్టార్టప్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం... 
పన్నుపరమైన అంశాలపై స్టార్టప్స్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పాత వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చీఫ్ పీసీ మోదీ తెలిపారు. ఇక నిబద్ధతతో పన్నులు చెల్లించేలా ప్రోత్సహించేందుకు ప్రాసిక్యూషన్ పరిధిలోకి వచ్చే పన్ను బకాయిల పరిమితిని రూ. 3,000 నుంచి రూ. 10,000కు పెంచినట్లు ఆయన వివరించారు. You may be interested

టీసీఎస్‌ షేరును ఏంచేద్దాం?

Wednesday 10th July 2019

జూన్‌ త్రైమాసికంలో టీసీఎస్‌ ఫలితాలు అంచనాల కన్నా స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్‌లు టీసీఎస్‌ షేరుపై మిశ్రమ రికమండేషన్లు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు టీసీఎస్‌ను కొనొచ్చని చెబుతుంటే, మరికొన్ని అట్టిపెట్టుకోమని, కొన్నేమో వదిలించుకోమని సూచిస్తున్నాయి. ఫలితాల నేపథ్యంలో షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి... 1. మోర్గాన్‌ స్టాన్లీ: ఈక్వల్‌ వెయిట్‌ రేటింగ్‌ కొనసాగింపు. టార్గెట్‌ రూ. 1980. ఫలితాల్లో ఆదాయ వృద్ధి అంచనాలను అందుకోలేదు. అయితే

డౌన్‌గ్రేడ్స్‌ పెరుగుతున్నాయ్‌!

Wednesday 10th July 2019

దేశీయ క్రెడిట్‌ మార్కెట్‌ సవాళ్ల సమయం ఎదుర్కొంటోంది. మార్కెట్లో క్రెడిట్‌ నాణ్యత క్షీణిస్తోందని కేర్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. కేర్‌ రేటింగ్స్‌ మదింపు చేసే ఎంసీఆర్‌(మోడిఫైడ్‌ క్రెడిట్‌ రేషియో) జూన్‌ త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ఠం 0.8కి చేరింది. దీంతో కేర్‌ రేటింగ్స్‌ జరిపే డౌన్‌గ్రేడ్స్‌ వేగం పుంజుకుఉన్నాయి. గతేడాది జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే తాజా త్రైమాసికంలో కేర్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేసిన కంపెనీల సంఖ్య 26 శాతం పెరిగింది. ఇదే సమయంలో

Most from this category