STOCKS

News


అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై ఆందోళన అనవసరం!

Thursday 19th December 2019
news_main1576746246.png-30312

హేమాంగ్‌ జానీ 
టాటా కంపెనీల వ్యాపారంలో రికవరీ చూస్తుంటే చంద్రశేఖర్‌ నేతృత్వం మంచి ఫలితాలు ఇస్తుందని తెలుస్తోందని షేర్‌ఖాన్‌ అనలిస్టు హేమాంగ్‌ జానీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై ఆందోళన అనవసరమని అభిప్రాయపడ్డారు. తీర్పు వచ్చాక టాటాగ్రూప్‌ షేర్లలో కొంత ఆందోళన కనిపించిందన్నారు. కానీ యథాతధ స్థితి కొనసాగే అవకాశాలున్నాయన్నది అర్ధం చేసుకోవాలని చెప్పారు. టాటాలు తప్పకుండా ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాయని అంచనా వేశారు. అయితే సుప్రీంకోర్టులో అంతిమ తీర్పు వచ్చే వరకు ప్రస్తుత యాజమాన్య నిర్మితిలో ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలన్నారు. ఒకవేళ ఎలాంటి మార్పులు లేకుంటే అప్పుడు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. చాలా రోజుల తర్వాత టాటా స్టీల్‌, టాటా మోటర్స్‌, టాటా హోటల్స్‌ తదితరాల్లో పునరుజ్జీవం కనిపిస్తోందన్నారు. అందువల్ల ఈ తరుణంలో అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ తీర్పును పెద్దగా పట్టించుకోవాల్సినవసరం లేదని సూచించారు. 
అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రస్తుతం పెద్ద ఆశ్చర్యపరిచే అంశాలేమీ కానరావడం లేదన్నారు. అందువల్ల విస్తృత మార్కెట్లో బలమైన రికవరీ ఛాన్సులు కనిపించడం లేదని, నిజానికి ప్రధాన సూచీల్లో కొంత మేర షార్ట్‌ స్వీజింగ్‌ కనిపిస్తోందని తెలిపారు. కొన్ని హెవీవెయిట్స్‌ అండతో మార్కెట్‌ గరిష్ఠాల వద్ద కొనసాగుతోందన్నారు. కానీ మార్కెట్లోని మిగిలిన షేర్లలో ఉత్సాహం కనిపించడం లేదని జానీ చెప్పారు. మార్కెట్‌ వర్గాల ఆసక్తుల్లో మార్పు వస్తోందనేందుకు మెటల్స్‌, టెలికం రంగాల్లో కనిపిస్తున్న కొంత పాజిటివ్‌నెస్‌ ఆధారమని వివరించారు. కానీ వృద్ధి, లిక్విడిటీ పరిస్థితులు చూసుకుంటే ఇప్పటికిప్పుడు స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో బలమైన రికవరీ కనిపించే అవకాశం లేదని అంచనా వేశారు. You may be interested

షేర్ల ఎంపికకు మొబియస్‌ సూత్రాలు!

Thursday 19th December 2019

మంచి రాబడినిచ్చే షేర్లను ఎంపిక చేసేందుకు వర్దమాన మార్కెట్స్‌ నిపుణుడు మార్క్‌మొబియస్‌ కొన్ని సూత్రాలను అవలంబిస్తుంటారు. ఇండియన్‌ ఎకనమిక్‌ కాంక్లేవ్‌లో ఆయన వీటిని వివరించారు. షేరు ఎంచుకునేందుకు మూడు పారామీటర్లు పరిశీలిస్తానని చెప్పారు.  ఒక షేరును కొనుగోలు చేయాలంటే దాని 1.రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌(ఆర్‌ఓసీఈ) 20 శాతం పైన ఉండాలి. 2. డెట్‌ టు ఈక్విటీ నిష్పత్తి 50 శాతం కన్నా తక్కువగా ఉండాలి. 3. డివిడెండ్‌ ఈల్డ్‌ 3-4 శాతం

బంగారంపై పెట్టుబడికి బోలెడు మార్గాలు!

Thursday 19th December 2019

భారతీయులకు బంగారం కేవలం ఆభరణమే కాదు, అది ఒక పెట్టుబడి సాధనం, ఒక హోదాచిహ్నం, ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో సంపదను కాపాడే అస్త్రమని ప్రముఖనిపుణుడు సుధేశ్‌ నంబియత్‌ చెబుతారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో బంగారం పెట్టుబడి సాధనంగా మరింతమందిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మనదగ్గర బంగారంపై పెట్టుబడులకు ఉన్న మార్గాలు ఎన్ని? అవి ఏంటి? చూద్దాం... 1. భౌతిక రూపంలో: బంగారాన్ని భౌతికంగా నాణేలు, అచ్చులు, ఆభరణాల రూపంలో కొనుగోలు చేయడం ఎక్కువగా

Most from this category