News


ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌కు చెల్లు..!

Thursday 12th March 2020
news_main1583983216.png-32417

  • ఎటువంటి చార్జీలు ఇకపై ఉండవు
  • ఎస్‌ఎంఎస్‌ చార్జీలూ ఎత్తివేత
  • ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త
  • సేవింగ్స్‌ బ్యాంకుపై 3 శాతమే వడ్డీ

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించింది. ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌ ఉంచాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్టు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతానికి గ్రామీణ శాఖల నుంచి పట్టణ శాఖల వరకు సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌ రూ.1,000-3,000 మధ్య ఉన్నది. అంటే ఈ మేరకు ఖాతాదారులు నెలవారీగా కనీస బ్యాలన్స్‌ను తప్పకుండా నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే ప్రస్తుతం రూ.5-15 మధ్య చార్జీ, దానిపై పన్నులను ఎస్‌బీఐ విధిస్తోంది. తాజాగా కనీస బ్యాలన్స్‌ నిబంధనను ఎత్తివేస్తూ 44.51 కోట్ల సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారులకు ఎస్‌బీఐ తీపి కబురందించింది. ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌ లేపోతే చార్జీలు విధించడాన్ని 2017 ఏప్రిల్‌లో ఎస్‌బీఐ అమల్లోకి తెచ్చింది. తొలుత భారీ చార్జీలు బాదగా, గతేడాది అక్టోబర్‌లో వీటిని గణనీయంగా తగ్గించి ఇప్పుడు పూర్తిగా తొలగించింది. ఎస్‌బీఐ బాటలో ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు నడుస్తాయేమో చూడాల్సి ఉంది. అలాగే, ఎస్‌బీఐ చార్జీలను కూడా ఎస్‌బీఐ తొలగించింది. లావాదేవీల వివరాలను ఎస్‌ఎంఎస్‌ రూపంలో అందిస్తూ, ఇందుకోసం త్రైమాసికం వారీగా ప్రస్తుతం బ్యాంకు చార్జీలను తీసుకుంటోంది. తాజా నిర్ణయాలు దేశంలో ఆర్థిక సేవల విస్తృతికి తోడ్పడతాయని ఎస్‌బీఐ పేర్కొంది. 
సేవింగ్స్‌ బ్యాంకుపై 3 శాతం వడ్డీ
ఇకపై అన్ని రకాల సేవింగ్స్‌ ఖాతా బ్యాలన్స్‌లపై 3 శాతం వార్షిక వడ్డీయే అమలవుతుందని ఎస్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం రూ.లక్ష వరకు బ్యాలన్స్‌ ఉంటే 3.25 శాతం, రూ.లక్షకుపైన బ్యాలన్స్‌ ఉంటే 3 శాతం రేటును ఆఫర్‌ చేస్తోంది. కానీ, ఇకపై అన్నింటికీ 3 శాతం రేటు అమలవుతుంది. ‘‘ఈ ప్రకటన మా విలువైన కస్టమర్లకు ఆనందాన్నిస్తుంది. ఎస్‌బీఐతో బ్యాంకింగ్‌ దిశగా కస్టమర్లు ఉత్సాహం చూపించేలా, వారిలో విశ్వాసాన్ని పెంపొందించేలా  చేస్తుందని నమ్ముతున్నాం’’ అంటూ ఎస్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగులు ఇలా ఎన్నో అంశాల్లో ఎస్‌బీఐ అగ్రగామి బ్యాంకుగా ఉంది.
ఎఫ్‌డీ, రుణ రేట్లకు కోత 
వివిధ కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ), ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై రేట్లను తగ్గిస్తూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు ఈ నెల 10 నుంచే అమల్లోకి వచ్చింది. రూ.2 కోట్లలోపు గల రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 50 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో 7-45 రోజుల ఎఫ్‌డీలపై రేటు 4.50 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. ఏడాది, అంతకంటే ఎక్కువ కాల వ్యవధి ఎఫ్‌డీపై రేటు 10 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. అలాగే, ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ రేటును 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో 7.85 శాతం నుంచి 7.75 శాతానికి దిగొచ్చింది. దీనివల్ల గృహ, వాహన రుణాలు చౌక కానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ రేటును తగ్గించడం ఇది పదోసారి. అలాగే, ఎఫ్‌డీ రేట్లను తగ్గించడం నెల వ్యవధిలో రెండోసారి. You may be interested

పునరుద్దరణ ప్రణాళిక ‘‘యస్‌’’

Thursday 12th March 2020

ఈక్విటీ, డెట్‌ మార్గాల్లో నిధులు రూ. 20వేల కోట్లు ఈక్విటీ కింద  సమకూర్చనున్న బ్యాంకులు సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌లోకి రూ. 30,000 కోట్లు రాణా కపూర్‌ ఈడీ కస్టడీ పొడిగింపు ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌ను పునరుద్ధరించే ప్రణాళికను రిజర్వ్‌ బ్యాంక్‌ ఖరారు చేసింది. మారటోరియం ఎత్తివేసినా నిధుల లభ్యతపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు పరిష్కారమార్గాలు ఇందులో పొందుపర్చింది. ప్రణాళిక ప్రకారం.. ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న ప్రభుత్వ రంగ ఎస్‌బీఐతో పాటు ఇతరత్రా

భారీ గ్యాప్‌ డౌన్‌తో ఓపెనింగ్‌ నేడు!

Thursday 12th March 2020

మళ్లీ ప్రపంచ మార్కెట్లలో కరోనా సునామీ 470 పాయింట్లు కుప్పకూలిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  బుధవారం యూఎస్‌ మార్కెట్ల పతనం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాల జోరు నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 470 పాయింట్లు పడిపోయి 9,986 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 10,455 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను

Most from this category