లిక్విడిటీ సమస్య లేదు
By Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకులు రుణ వితరణ కార్యకలాపాలను పెంచాయని, వినియోగం పెరుగుతోందని, దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగం (2019 అక్టోబర్ నుంచి 2020 మార్చి వరకు) నుంచి ఆర్థిక రంగ వృద్ధి పుంజుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. గురువారం ఢిల్లీలో ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ల అధినేతలతో భేటీ అయిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... అవి ఎటువంటి ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలను ఎదుర్కోవడం లేదని ప్రకటించారు. రుణాలకు తగినంత డిమాండ్ ఉందని అవి చెప్పినట్టు పేర్కొన్నారు. ఇది మంచి శక్తినిచ్చే టానిక్‌వంటి సమావేశమని, మంచి విషయాలను, సానుకూల అంశాలను విన్నట్టు మంత్రి చెప్పారు. ఆర్థిక రంగ వృద్ధి క్షీణత బోటమ్ అవుట్ (ఈ స్థాయి నుంచి పడిపోకపోవడం) చేరుకుందన్నారు. రానున్న పండుగల సీజన్ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరి 5 శాతంగా నమోదైన విషయం గమనార్హం. వాహనాల అమ్మకాలు పడిపోవడం అన్నది సైక్లికల్‌గా జరిగిందేనని, వచ్చే ఒకటి రెండు త్రైమాసికాల్లో మెరుగుపడుతుందని బ్యాంకులు చెప్పినట్టుగా మంత్రి వెల్లడించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ... పండుగల సమయంలో రుణాలను అందించేందుకు దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో బ్యాంకులు మేళాలు నిర్వహిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రైవేటు బ్యాంకులను కూడా ఆహ్వానించినట్టు చెప్పారు. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్‌కోటక్ మాట్లాడుతూ... అక్టోబర్ నుంచి అధిక శాతం బ్యాంకులు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లెండింగ్ రేట్లను అనుసరించనున్నట్టు ప్రకటించారు. కార్పొరేట్ పన్ను తగ్గింపుతో ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటాయన్నారు.
You may be interested
వన్‌ప్లస్ 55-అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ విడుదల
Friday 27th September 2019ప్రారంభ ధర రూ. 69,900 న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ భారత స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి ప్రవేశించింది. క్వాంటమ్ డాట్ ఎల్ఈడీ టెక్నాలజీ (4కే క్యూఎల్ఈడీ డిస్ప్లే)లో రెండు వేరియంట్లలో టీవీని ఇక్కడి మార్కెట్లోకి విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ. 69,900 - రూ. 99,900 కాగా, ఈనెల 28 నుంచి అమ్మకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. హెచ్ఆర్డీ 10ప్లస్ సపోర్ట్, 50వాట్స్ ఎనిమిది-స్పీకర్ల సెటప్, సినిమాటిక్ సౌండ్
‘సార్టప్ ఇండియా’ను వాడుకోండి...
Friday 27th September 2019ప్రపంచ సవాళ్లకు ఇదో చక్కని పరిష్కార వేదిక... గ్లోబల్ సీఈఓలకు ప్రధాని మోదీ సూచన... మోదీ ప్రసంగానికి కార్పొరేట్ దిగ్గజాల కితాబు న్యూయార్క్: ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లకు ‘స్టార్టప్ ఇండియా’ను ఒక పరిష్కార వేదికగా ఉపయోగించుకోవాలని గ్లోబల్, అమెరికా దిగ్గజ సీఈఓలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ముఖ్యంగా పోషకాహారం, వర్థాల నిర్వహణ వంటి అంశాల్లో నెలకొన్న సవాళ్లకు స్టార్టప్ ఇండియా నుంచి వస్తున్న నవకల్పనలు చేదోడునందిస్తాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి వార్షిక