సీఎస్ఆర్లో విఫలమైతే నేరంగా చూడబోం
By Sakshi

న్యూఢిల్లీ: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమం కింద ఏదేనీ కంపెనీ నిర్ణీత మేర నిధులను ఖర్చు చేయని సందర్భాల్లో నేరంగా పరిగణించే ఉద్దేశ్యమేదీ లేదని కార్పొరేట్ వ్యవహారాల శాఖ స్పష్టం చసింది. సీఎస్ఆర్ అన్నది ఇకపై ఎంత మాత్రం ఔదార్య చర్యగా కొనసాగదన్నారు. కంపెనీలు తమ వార్షిక లాభాల్లో 2 శాతం మేర (క్రితం మూడు సంవత్సరాల సగటు వార్షిక లాభం) సీఎస్ఆర్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. సవరించిన కంపెనీల చట్టం 2013లో సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేయని యెడల శిక్షా నిబంధనలు పొందుపరిచిందన్న ఆందోళనల నేపథ్యంలో కార్పొరేట్ శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ స్పందిస్తూ... కంపెనీలు ఇప్పటి వరకు సమాజం కోసం చేసిన నిధుల వ్యయాలను ప్రభుత్వం గొప్పగా అభినందిస్తుందని, వ్యాపారస్థులు భయపడనవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కంపెనీల చట్టంలో సెక్షన్ 134 శిక్షాత్మక ప్రొవిజన్ ఇంతకుముందు నుంచే ఉందని కొత్తగా ఏమీ చేర్చలేదని స్పష్టం చేశారు. సవరణ చట్టంలో సెక్షన్ 135 కింద సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేయకపోతే రూ.50,000 నుంచి రూ.25 లక్షల వరకు జరిమానాను పొందుపరిచారు. అలాగే, సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేయడంలో విఫలమయ్యే కంపెనీ అధికారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధించేలా పేర్కొన్నారు.
You may be interested
నగరాల్లో దూసుకెళ్తున్న క్విక్ రైడ్..
Friday 9th August 2019యూజర్ల సంఖ్య 20 లక్షలకు చేరిక కంపెనీ కో-ఫౌండర్ కేఎన్ఎం రావు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:- కార్, బైక్ పూలింగ్ సంస్థ క్విక్ రైడ్ తొమ్మిది నగరాల్లో 20 లక్షల యూజర్లతో దూసుకెళ్తోంది. ఇందులో ఒక్క హైదరాబాద్లోనే కంపెనీకి 3 లక్షల మంది వినియోగదార్లున్నారు. రోజుకు 90,000లకుపైగా కార్ పూల్స్ నమోదవుతున్నాయి. దీనిని 2020 చివరికల్లా 10 లక్షల స్థాయికి తీసుకెళ్లాలన్నది లక్ష్యమని క్విక్ రైడ్ కో-ఫౌండర్ కేఎన్ఎం రావు గురువారమిక్కడ మీడియాకు
మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల రక్షణకు సెబీ కొత్త చర్యలు
Friday 9th August 2019లిస్టెడ్ షేర్లు, డెట్ సెక్యూరిటీల్లోనే పెట్టుబడులు రేటింగ్లేని సెక్యూరిటీల్లో పెట్టుబడుల పరిమితి తగ్గింపు న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల రక్షణ దిశగా సెబీ నూతన నిర్ణయాలను అమల్లోకి తీసుకురానుంది. ఏఎంసీలు తమ పెట్టుబడులు అన్నింటినీ దశలవారీగా లిస్టెడ్ ఈక్విటీలు, డెట్ సెక్యూరిటీల్లోకి మళ్లించడం ఇందులో ఒకటి. జూన్ నెలలో సెబీ బోర్డులో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే దిశగా ఇందుకు సంబంధించి నిబంధనల సవరణల ముసాయిదాను తాజాగా సెబీ ఖరారు చేసింది.