News


ఆర్థిక మందగమనం లేదు

Thursday 19th September 2019
news_main1568865242.png-28423

  • పన్నులు తగ్గించేందుకు కంపెనీల ఎత్తుగడలే
  • బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌మోదీ

పాట్నా: దేశం ఆర్థిక మందగమనాన్ని ఏమీ ఎదుర్కోవడం లేదన్నారు బీహార్‌ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌కుమార్‌ మోదీ. తయారీ పడిపోతుందని చూపిస్తూ పన్నులు తగ్గించాలంటూ ప్రభుత్వంపై కంపెనీలు ఒత్తిడి తీసుకొచ్చేందుకు అనసరిస్తున్న ఎత్తుగడలుగా దీన్ని అభివర్ణించారు. తన వాదనకు మద్దతుగా బీహార్‌లో పార్లే జీ బిస్కట్ల డిమాండ్‌ పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు. బిహార్‌ ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలను సుశీల్‌మోదీయే చూస్తున్నారు. అయినా కంపెనీ బిస్కట్ల డిమాండ్‌ తగ్గిందని తయారీదారులు చెబుతున్నారంటే... అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చౌకగా లభించే పార్లే జీ వంటి అధిక పన్ను రేటున్న వాటికి బదులు ఖరీదైన ప్యాస్ట్రీని ఎంచుకుంటున్నట్టు ఆయన సందేహం వ్యక్తం చేశారు. రాంచిలో ఓ వార్తా చానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సుశీల్‌మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ పరిధిలో అధిక పన్నులు చెల్లించాల్సి రావడం వల్ల ధరలు పెరిగాయని, దీంతో డిమాండ్‌ భారీగా పడిపోయిందంటూ, ఇలా అయితే ఉద్యోగులను ఎద్ద ఎత్తున తొలగించాల్సి రావచ్చని పార్లే ఇటీవలే ప్రకటన చేసింది.  ఆటోమొబైల్స్‌, ఇతర రంగాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని మీడియాలో వస్తున్నదంతా కార్పొరేట్‌ ప్రపంచం చేస్తున్న లాబీయింగ్‌లో భాగమేనన్నారు మోదీ. ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెంచి పన్ను రేట్లను తగ్గించుకునేందుకునేనని అభివర్ణించారు. You may be interested

కో-లొకేషన్‌ కేసులో మీ సమాధానం ఏమిటి?

Thursday 19th September 2019

ఎన్‌ఎస్‌ఈ అధికారులకు శాట్‌ ఆదేశాలు ముంబై: కో-లొకేషన్‌ కేసు విషయంలో తమ వాదనలను సమగ్రంగా (రీజాయిండర్స్‌) నాలుగువారాల్లో తెలియజేయాలని   స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) అధికారులకు సెక్యూరిటీస్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) ఆదేశాలు జారీ చేసింది. అటు తర్వాత ఈ సమయాన్ని పెంచేదిలేదని స్పష్టం చేసింది. కేసు పరిష్కార తేదీన నవంబర్‌ 27గా ట్రిబ్యునల్‌ నిర్ణయించింది. ఎన్‌ఎస్‌ఈ సీఈఓగా పనిచేసిన చిత్రా రామకృష్ణన్‌ కూడా ఈ ఆదేశాలు అందుకున్న వారిలో ఉన్నారు.

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌పై రూ.10 లక్షల జరిమానా

Thursday 19th September 2019

45 రోజుల్లో చెల్లించాలి  ఆదేశించిన సెబీ  న్యూఢిల్లీ: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌) కంపెనీపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ రూ.10 లక్షల జరిమానా విధించింది. రైట్స్‌ ఇష్యూ ద్వారా పెట్టుబడుల సమీకరణ, ఆస్తుల విక్రయానికి సంబంధించిన సమాచారాన్ని బీఎస్‌ఈకి వెల్లడించనందుకు సెబీ ఈ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. గత ఏడాది జూలైలో రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించాలని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డైరెక్టర్ల​

Most from this category