News


పెద్ద సంస్థలకు డిజిటల్‌ చెల్లింపులపై ఇక చార్జీల్లేవు

Saturday 19th October 2019
news_main1571458417.png-28993

న్యూఢిల్లీ: బ్యాంకులు లేదా సిస్టమ్‌ ప్రొవైడర్లు.. రూ.50 కోట్లకు పైగా టర్నోవర్‌ కలిగిన వ్యాపార సంస్థలకు డిజిటల్‌ రూపంలో చేసే చెల్లింపులపై అటు కస్టమర్ల నుంచి కానీ, ఇటు వర్తకుల నుంచి కానీ ఎటువంటి చార్జీలు లేదా మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును వసూలు చేయరాదంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. వార్షిక టర్నోవర్‌ రూ.50 కోట్లకు పైగా ఉన్న సంస్థలు తమ కస్టమర్లకు తక్కువ చార్జీలతో కూడిన డిజిటల్‌ చెల్లింపుల విధానాలను ఆఫర్‌ చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొ‍న్న విషయం గమనార్హం. బ్యాంకులే ఈ ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం ఆదాయపన్ను చట్టంలో, పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ యాక్ట్‌ 2007లో సవరణలు చేశారు. నూతన నిబంధనలు నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తన ఆదేశాల్లో తెలియజేసింది. 



You may be interested

ఏటా అయిదు కొత్త ఉత్పత్తులు

Saturday 19th October 2019

ఐఐఎల్‌ ఎండీ రాజేశ్‌ అగర్వాల్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- అగ్రోకెమికల్స్‌ కంపెనీ ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా (ఐఐఎల్‌) ఏటా అయిదు కొత్త ఉత్పాదనలను తేనుంది. ప్రస్తుతం కంపెనీ 18 రకాల ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తోంది. వీటికి మూడు నాలుగు ఉత్పత్తులు ఈ ఏడాది జతకూడనున్నాయని ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా ఎండీ రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. మిరపను నాశనం చేసే పురుగులను హరించే కునోయిచిని విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గతేడాది నూతన తరం

అంచనాలు తగ్గించినా.. భారత్‌దే అగ్రస్థానం

Saturday 19th October 2019

ఐఎంఎఫ్‌ వృద్ధి నివేదికపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వృద్ధి వేగవంతం చేసేందుకు మరిన్ని చర్యలు వాషింగ్టన్‌: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనాలను కుదించినా.. ఇప్పటికీ అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అధిక వృద్ధి సాధన దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోందని ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె విలేకరులకు చెప్పారు.

Most from this category