News


జనవరి నుంచి నెఫ్ట్‌ చార్జీలకు మంగళం

Saturday 9th November 2019
Markets_main1573269712.png-29464

  • వసూలు చేయరాదని ‍బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం

ముంబై: వచ్చే జనవరి నుంచి సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారులు ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌’ (నెఫ్ట్‌) లావాదేవీలపై ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆర్‌బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల మధ్య ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించి నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలను ఆర్‌బీఐ నిర్వహిస్తుంటుంది. నెఫ్ట్‌ లావాదేవీలను బ్యాచ్‌ల వారీగా అరగంటకోసారి సెటిల్‌ చేస్తున్నారు. అదే ఆర్‌టీజీఎస్‌ అయితే ప్రతీ లావాదేవీ అప్పటికప్పుడే, విడిగా పూర్తి అవుతుంది. ‘‘దేశ పౌరులకు అసాధారణ చెల్లింపుల అనుభవాన్ని కల్పించేందుకు సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారుల నుంచి నెఫ్ట్‌ చార్జీలను 2020 జనవరి నుంచి వసూలు చేయరాదని బ్యాంకులను ఆదేశిస్తున్నాం’’ అని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. పార్కింగ్‌ ఫీజు, ఇంధనం నింపుకునే వద్ద చెల్లింపులకు సైతం ఫాస్టాగ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళికతో ఉన్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. డీమోనిటైజేషన్‌ జరిగి మూడేళ్లయిన సందర్భంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతానికి రూ.10,000 విలువ వరకు నెఫ్ట్‌ చార్జీలపై రూ.2 చార్జీని, దీనిపై అదనంగా జీఎస్‌టీని బ్యాంకులు వసూలు చేస్తు‍న్నాయి. రూ.2లక్షల పైన ఉన్న లావాదేవీలపై ఎస్‌బీఐ రూ.20 చార్జీని, దీనిపై జీఎస్‌టీని వసూలు చేస్తోంది. అదే ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలు రూ.2-5 లక్షల లావాదేవీలపై రూ.20, అదనంగా జీఎస్‌టీని, రూ.5 లక్షలపైన ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలపై రూ.40, జీఎస్‌టీని వసూలు చేస్తున్నాయి. 



You may be interested

అమెజాన్‌ ‘కళా హాత్‌’లో 280 రకాల ఉత్పత్తులు

Saturday 9th November 2019

2020 చివరికి 500కు చేరుస్తాం ‘ప్రయాన్‌’ ఎండీ సందీప్‌ వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ తన పోర్టల్‌లో ‘కళా హాత్‌’ పేరిట నిర్వహిస్తున్న స్టోర్‌లో 280 రకాల కళారూపాల తాలూకు ఉత్పత్తులు నమోదయ్యాయని ‘ప్రయాన్‌’ ఎండీ సందీప్‌ వరగంటి చెప్పారు. 2020 చివరి నాటికి 500 రకాల కళారూపాలను ఈ-కామర్స్‌ పోర్టల్‌లో పరిచయం చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారాయన. కాటమరాన్‌ వెంచర్స్‌, అమెజాన్‌ల సంయుక్త కంపెనీ అయిన ప్రయాన్‌...

వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

Saturday 9th November 2019

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిపాజిట్‌, రుణ రేట్లను తగ్గించింది. తాజా రేట్లు నవంబర్‌ 10 నుంచీ అమల్లోకి వస్తాయి. శుక్రవారం బ్యాంక్‌ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. దీనిప్రకారం... నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్‌) రుణ రేటు అన్ని కాలపరిమితులపై ఐదు బేసిస్‌ పాయింట్లు తగ్గింది.  బ్యాంక్‌ ఈ ఏడాది రుణరేటు తగ్గించడం ఇది వరుసగా ఏడవసారి.  ఆటో, గృహ,

Most from this category