పెట్రోల్ బంకుల్లో క్రెడిట్‌కార్డుపై క్యాష్‌బ్యాక్ ఉండదిక..!
By Sakshi

న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల్లో ఇక క్రెడిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై అక్టోబర్ 1 నుంచి 0.75 శాతం క్యాష్‌బ్యాక్ ఉండబోదు. డీమోనిటైజేషన్ తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకుగాను కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగుణంగా... ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు (బీపీసీఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్) ఇంధనం కోసం చేసే డిజిటల్ చెల్లింపులపై (క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు, వ్యాలెట్ ద్వారా) 0.75 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టాయి. దీన్ని తొలగిస్తున్నట్టు ఎస్బీఐ తన కార్డుదారులకు సమాచారం ఇచ్చింది. ‘‘ప్రియమైన క్రెడిట్ కార్డు హోల్డర్, ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థల సూచనలకు అనుగుణంగా, ఫ్యూయల్ లావాదేవీలపై అందిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్ 2019 అక్టోబర్ 1 నుంచి నిలిపివేయడం జరుగుతుంది’’ అని ఎస్బీఐ తన కార్డుదారులకు సమాచారం ఇచ్చింది. అన్ని రకాల క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై క్యాష్‌బ్యాక్‌ను నిలిపివేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు. డెబిట్‌కార్డు, వ్యాలెట్ ద్వారా చేసే చెల్లింపులపై ఈ సదుపాయం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీమోనిటైజేషన్ తర్వాత కార్డు చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను కూడా చమురు మార్కెటింగ్ సంస్థలే భరించాలని కేంద్రం కోరింది. దీంతో ఈ రెండింటి రూపంలో మూడు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 2017-18లో రూ.1,431 కోట్లు, 2018-19లో రూ.2,000 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది.
You may be interested
తొమ్మిది బ్యాంకులను మూసివేత... పుకార్లే!
Thursday 26th September 2019ముంబై: తొమ్మిది వాణిజ్య బ్యాంకులు మూతపడబోతున్నాయంటూ... సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని అటు కేంద్రం ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం స్పష్టం చేశాయి. వీటిలో ఏ మాత్రం నిజం లేదని ఫైనాన్స్ కార్యదర్శి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. పైగా మరింత మూలధనం సమకూర్చి ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టం చేయడానికి కేంద్రం తగిన అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు. ఆర్బీఐ కూడా సోషల్ మీడియాలో
గ్యాప్‌అప్ ప్రారంభం
Thursday 26th September 2019క్రితం రోజు భారీగా దిద్దుబాటుకు లోనైన భారత్ స్టాక్ సూచీలు గురువారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంతో 38,700 పాయింట్ల వద్ద ప్రారంభమై, క్షణాల్లో 38,800 పాయింట్ల స్థాయిని అధిగమించింది. అలాగే నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,470 పాయింట్ల వద్ద మొదలై, నిముషాల్లో 11,540 పాయింట్ల స్థాయిని అందుకుంది.