News


హైదరాబాద్‌లో నోబ్రోకర్‌.కామ్‌ సేవలు

Thursday 8th August 2019
news_main1565243045.png-27631

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్‌ నోబ్రోకర్‌.కామ్‌ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. కస్టమర్‌ నుంచి కస్టమర్‌కు సేవలందిస్తున్న ఈ కంపెనీ ఇప్పటికే అయిదు నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. అద్దె, కొనుగోలు, విక్రయానికి ఉన్న రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ ప్రాపర్టీస్‌ను ఈ పోర్టల్‌లో నమోదు చేయవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల్లో ఎటువంటి బ్రోకరేజ్‌ వసూలు చేయబోమని కంపెనీ ఫౌండర్‌, సీబీవో సౌరభ్‌ గర్గ్‌ తెలిపారు. ఫౌండర్‌, సీటీవో అఖిల్‌ గుప్తాతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఒక్క భాగ్యనగరిలో బ్రోకరేజ్‌ వ్యాపారం ఏటా రూ.4,100 కోట్లుంది. ఈ నగరంలో నోబ్రోకర్‌.కామ్‌లో 15,000పైచిలుకు లిస్టింగ్స్‌ జరిగాయి. 33,000లకుపైగా కస్టమర్లు సేవలను వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా సంస్థకు 65 లక్షల వినియోగదార్లున్నారు. 5 లక్షల లావాదేవీలు పూర్తి అయ్యాయి’ అని వివరించారు.



You may be interested

ఉత్పత్తి నాణ్యతకే ప్రధమ ప్రాధాన్యం

Thursday 8th August 2019

నచ్చకపోతే తిప్పి పంపేయడమే దేశంలో ఆన్‌లైన్‌ షాపర్ల ధోరణి యూపీఎస్‌ పల్స్‌ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: ఆకర్షణీయంగా కనిపించే వెబ్‌సైట్‌, ఆధునికతను ఒలకబోసే మొబైల్‌ యాప్‌... ఆన్‌లైన్‌ షాపర్లను ఆకర్షించేవి ఇవి కావట. ఫీజుల విషయంలో పారదర్శకత, డెలివరీపై నియంత్రణ, స్పష్టతతో కూడిన రిటర్న్‌ పాలసీ, లాయల్టీ రివార్డులు వీటికి ఆన్‌లైన్‌ షాపర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు యూపీఎస్‌ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్‌ షాపర్స్‌ పల్స్‌ అధ్యయనంలో తెలిసింది. ఆన్‌లైన్‌ రిటైలర్లకు తదుపరి హద్దులు ఇవేనని

హైదరాబాద్‌లో రూ.700 ‍కోట్లతో కటేరా ప్లాంటు

Thursday 8th August 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- డిజైన్‌, టెక్నాలజీని ఆసరాగా చేసుకుని నిర్మాణ రంగంలో ఉన్న యూఎస్‌ కంపెనీ కటేరా హైదరాబాద్‌ వద్ద ప్లాంటును నెలకొల్పుతోంది. శంషాబాద్‌ సమీపంలో 50 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి కంపెనీ సుమారు రూ.700 కోట్లు వెచ్చిస్తోంది. నవంబరు నుంచి ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తుల తయారీ ప్రారంభం అవుతుందని కటేరా ఆసియా ప్రెసిడెంట్‌ ఆశ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు. డిజైన్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ నజీబ్‌ ఖాన్‌తో

Most from this category