News


చత్తీస్‌గఢ్‌ స్టీల్‌ ప్లాంట్‌ 2020లో రెడీ

Saturday 31st August 2019
news_main1567230286.png-28124

  • ఎన్‌ఎండీసీ సీఎండీ బైజేంద్ర కుమార్‌

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ చత్తీస్‌గఢ్‌లో నిర్మిస్తున్న స్టీల్‌ ప్లాంటు పనులు చకచకా సాగుతున్నాయి. ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 మిలియన్‌ టన్నులు. 2020 అక్టోబరు-డిసెంబరులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని సంస్థ సీఎండీ ఎన్‌.బైజేంద్ర కుమార్‌ శుక్రవారం జరిగిన 61వ వార్షిక సాధారణ సమావేశంలో వెల్లడించారు. ‘చత్తీస్‌గఢ్‌ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో కలిసి కొత్త గనుల అభివృద్ధి చేపట్టనున్నాం. ఈ భాగస్వామ్యం ద్వారా వచ్చే 4-5 ఏళ్లలో సంస్థ ఉత్పత్తి సామర్థ్యానికి 10 మిలియన్‌ టన్నులు జతకూడతాయి. టాంజానియాలో బంగారం వెలికితీత, ప్రాసెసింగ్‌ ప్లాంటు పైలట్‌ ప్రాతిపదికన చేపట్టే పనిలో ఉన్నాం’ అని వివరించారు. 



You may be interested

ఐటీఆర్‌ దాఖలుకు నేటి వరకే గడువు

Saturday 31st August 2019

గడువు పొడగించలేదని స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువు పొడిగించలేదని, ఈ నెల 31లోపు (శనివారం) కచ్చితంగా దాఖలు చేయాల్సిందేనని ఆదాయపన్ను శాఖ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చింది. ఐటీఆర్‌ దాఖలుకు గడువును ప్రభుత్వం మరో నెల పాటు పొడిగించిందటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఖండించింది. ‘‘సామాజిక మాధ్యమాల్లో సీబీడీటీ గడువు పొడిగించినట్టు ప్రచారమవుతున్న ఆదేశాలు నిజం కాదు. పన్ను చెల్లింపుదారులు పొడిగించిన గడువు ఆగస్ట్‌

చైనాను వీడనున్న 13% కంపెనీలు: ట్రంప్‌

Saturday 31st August 2019

సెప్టెంబర్‌ 1 నుంచి చైనా దిగుమతులపై విధించనున్న సుంకాల వలన సమీప భవిష్యత్తులో 13 శాతం కంపెనీలు చైనాను వీడతాయని శుక్రవారం యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి, ట్రంప్ చైనా దిగుమతులపై భారీగా సుంకాలను విధించడంతో ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా ట్రేడ్‌వార్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ‘చైనా తనకు తానుగా ఈ పరిస్థితిని తెచ్చుకుంది. సమీప భవిష్యత్తులో సుమారుగా 13 శాతం

Most from this category