News


ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు తగ్గుతాయి: నీతీ ఆయోగ్‌

Thursday 29th August 2019
news_main1567060323.png-28086

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ కార్ల ధరలకే ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు దిగివస్తాయని నీతీ ఆయోగ్‌ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. బ్యాటరీల ధరలు గణనీయంగా తగ్గుతునందున భారత్‌ వీటి వినియోగం దిశగా మార్పుకు సిద్ధంకావాలన్నారు. వచ్చే 3-4 ఏళ్లలో ఇతర ఇంధన ధరల కార్లకే ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ‘బ్యాటరీ వ్యయం బాగా తగ్గింది. గతంలో 267 అమెరికా డాలర్లుగా ఉన్న కిలోవాట్‌ అవర్‌ (కేడబ్ల్యూహెచ్‌) ధర ప్రస్తుతం 76 డాలర్లకే లభ్యమవుతోంది. ఈ తగ్గుదల ఆధారంగా వచ్చే 4 ఏళ్లలో ఇతర వాహనాల ధరలకు సరిసమానంగా ఈవీ వాహన ధరలు దిగివస్తాయి’ అని వ్యాఖ్యానించారు. 



You may be interested

టయోటా, సుజుకీ జట్టు

Thursday 29th August 2019

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ కోసం భాగస్వామ్యం టోక్యో: జపాన్‌కు చెందిన వాహన దిగ్గజం టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం).. మరో వాహన కంపెనీ సుజుకీ మోటార్ కార్ప్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం ప్రకటించింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ కోసమే పోటీ కంపెనీలో వాటాను కొనుగోలు చేసి జట్టుకట్టినట్లు వివరించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రకారం.. సుజుకీ మోటార్ కార్ప్‌లో 4.9 శాతం వాటాను (908

డీటీసీతో ‘పన్ను’ ఊరట!

Thursday 29th August 2019

తగ్గనున్న వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు... గరిష్ట పన్ను రేటు 20 శాతమే డివిడెండ్‌ పంపిణీపై పన్ను ఎత్తేయాలి ప్రభుత్వానికి డైరెక్ట్‌ ట్యాక్స్‌ కోడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిఫారసులు న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కోడ్‌(డీటీసీ) సమీక్ష కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ ప్యానెల్‌.. పన్నుల భారం తగ్గించే దిశగా కీలక సిఫారసులు చేసింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, డివిడెండ్‌ పంపిణీపై పన్ను (డీడీటీ)ను ఎత్తివేయాలని ప్యానెల్‌ చేసిన సిఫారసుల్లో ముఖ్యమైనవి.

Most from this category