News


నీతా అంబానీకి అరుదైన గౌరవం..

Thursday 14th November 2019
news_main1573705449.png-29580

  • ది మెట్రోపాలియన్ మ్యూజియం బోర్డులో చోటు

న్యూయార్క్‌: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ కళలు, సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌ (ది మెట్‌)’ బోర్డులో ఆమె చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే ది మెట్ అంతర్జాతీయ మండలిలో నీతా అంబానీ సభ్యురాలు. తాజాగా గౌరవ ట్రస్టీగా నీతా అంబానీ (56) ఎంపికైనట్లు మ్యూజియం చైర్మన్ డేనియల్ బ్రాడ్‌స్కీ వెల్లడించారు. భారతీయ సంస్కృతి, కళలు, కళాకారుల ప్రదర్శనలకు సంబంధించి 2016 నుంచి ది మెట్‌కు రిలయన్స్ ఫౌండేషన్ తోడ్పడుతోందని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శకులను ఆకర్షించే అతి పెద్ద ఆర్ట్ మ్యూజియంగా అమెరికాలోని ‘ది మెట్‌’ పేరొందింది. 



You may be interested

ప్రభుత్వ సాయం రాకుంటే ఐడియా దివాలా పిటిషన్‌!

Thursday 14th November 2019

కొత్త నిధులు అందించేందుకు బిర్లాల విముఖత టెలికం రంగానికి ప్రభుత్వ సాయం అందకుంటే వొడాఫోన్‌ ఐడియాను దివాలాకు వదిలేయాలని బిర్లాలు నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితుల్లో వీఐఎల్‌లోకి కొత్తగా నిధులేమీ అందించకూడదని బిర్లా గ్రూప్‌ నిర్ణయించుకుందని తెలిపాయి. టెలికం వ్యాపారం లాభసాటిగా లేదని, ఈ వ్యాపారం అస్థిరంగా మారిందని, గ్రూప్‌ లాభాలకు గుదిబండలాగా తయారైందని, ఈ నేపథ్యంలో మరిన్ని నిధులు ఈ వ్యాపారంపై పెట్టాల్సిన అవసరం లేదని గ్రూప్‌

భెల్‌ లాభం 42 శాతం అప్‌

Thursday 14th November 2019

రూ.121 కోట్లకు నికర లాభం  తొలి ఆర్నెల్లలో మాత్రం రూ.98 కోట్ల నష్టాలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ సంస్థ, భెల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్లో 42 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ2లో రూ.85 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.121 కోట్లకు పెరిగినట్లు భెల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,934 కోట్ల నుంచి రూ.6,360

Most from this category