News


నిస్సాన్‌లో 10వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..!

Thursday 25th July 2019
news_main1564037289.png-27307

టోక్యో: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్‌ ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే యోచనలో ఉన్నట్లు జపాన్‌ మీడియా బుధవారం వెల్లడించింది. కంపెనీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల ఆధారంగా ఈ విషయాన్ని ప్రచురిస్తున్నట్లు పేర్కొంది. నిస్సాన్‌ చైర్మన్‌ కార్లోస్ ఘోన్‌ అరెస్టు తరువాత ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తున్నామని, ఇదే సమయంలో అమెరికా, యూరప్‌లో అమ్మకాలు తగ్గిపోవడం వల్ల తొలి త్రైమాసిక నిర్వహణ లాభం గణనీయంగా తగ్గిపోయిందని ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంచనాలు వెల్లడయ్యాయి. గతంలో కంపెనీ 4,800 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఈ సంఖ్య రెట్టింపును దాటి 10,000 వరకు ఉండవచ్చని అక్కడి మీడియా వివరించింది. ఈ అంశంపై స్పందించిన కంపెనీ ఆడిట్‌ కమిటీ.. ఉద్యోగాల కోత పరంగా గురువారం స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపింది.



You may be interested

రూ.199కే నెట్‌ఫ్లిక్స్ మొబైల్‌ ప్లాన్‌

Thursday 25th July 2019

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రీమియం వీడియో స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్.. భారత మొబైల్‌ వినియోగదారుల కోసం అత్యంత చౌక ప్లాన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.199కే నెలవారీ మొబైల్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ నూతన ప్లాన్‌లో భాగంగా ఎటువంటి ప్రకటనలు లేనటువంటి స్టాండర్డ్‌ డిఫినిషన్‌ (ఎస్‌డీ) వీడియోలను ప్రేక్షకులు వీక్షించవచ్చని వివరించింది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్లకు మాత్రమే వర్తించే ఈ చౌక ప్లాన్‌ కేవలం భారత కస్టమర్లకు మాత్రమే అందుబాటులో

10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..

Thursday 25th July 2019

మందగమనంలో ఆటో రంగం కోలుకోవడానికి తోడ్పాటు అందించాలి కేంద్రానికి ఆటో పరికరాల తయారీ సంస్థల విన్నపం న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమలో మందగమనం మరింత కాలం కొనసాగితే 10 లక్షల పైచిలుకు ఉద్యోగాలకు కోత పడే ముప్పు పొంచి ఉందని ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను పెంచే దిశగా జీఎస్‌టీ రేటు తగ్గింపు తదితర చర్యలతో ఆటోమొబైల్ రంగం కోలుకునేందుకు తోడ్పాటు అందించాలని కేంద్రానికి

Most from this category