News


‘నిస్సాన్‌’ చెన్నై ప్లాంట్‌లో 1,700 ఉద్యోగాలకు కోత..!

Saturday 27th July 2019
news_main1564202377.png-27350

  • మాన్యుఫ్యాక్చరింగ్‌ విభాగంలోనే అధికం

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ నిస్సాన్‌.. భారత్‌లోని తన చెన్నై ప్లాంట్‌లో భారీ స్థాయిలో ఉద్యోగాలను తగ్గించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆరు వేలకు మించి ఉద్యోగులను తీసివేయనున్నట్లు కంపెనీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 6,100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు వెల్లడించింది. ఆరు ప్రధాన నగరాల్లో ఈ కోతలు ఉండనున్నట్లు పేర్కొంది. ఈ తాజా ప్రకటన ఆధారంగా.. రెనో-నిస్సాన్‌ భాగస్వామ్యంతో చెన్నైలో ఏర్పాటైన ఈ ప్లాంట్‌లో 1,700లకు మించి ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారని ఆటో రంగ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కలిపి దాదాపు 40,000 మంది ఇక్కడి ప్లాంట్‌లో పనిచేస్తుండగా.. ఏడాదికి 4.8 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉంది. మాన్యుఫ్యాక్చరింగ్‌ విభాగంలోనే ఈ కోతలు అధికంగా ఉండేందుకు అస్కారం ఉందని భావిస్తున్నాయి. అమెరికా, యూరప్‌లో అమ్మకాలు భారీగా క్షీణించడం వల్ల తొలి త్రైమాసిక నిర్వహణ లాభం గణనీయంగా తగ్గిపోయిందని.. నిస్సాన్‌ చైర్మన్‌ కార్లోస్ ఘోన్‌ అరెస్టు తరువాత ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తున్నామని సంస్థ తాజాగా వెల్లడించిన అంశం తెలిసిందే.



You may be interested

జీఎంఆర్‌ సంస్థల విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

Saturday 27th July 2019

హైదరాబాద్‌: జీఎంఆర్‌ గ్రూప్ సంస్థల విలీనం, విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిపాదనల ప్రకారం జీఎంఆర్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌లో జీఎంఆర్‌ హైదరాబాద్ ఎయిర్‌ కార్గో అండ్ లాజిస్టిక్స్‌ను విలీనం చేయనున్నారు. అలాగే, జీఎంఆర్‌ ఏరోటెక్నిక్‌కి చెందిన మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవరాలింగ్ (ఎంఆర్‌వో) వ్యాపార విభాగాన్ని జీఎంఆర్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌ సంస్థ కింద విడగొట్టనున్నారు. మూడు సంస్థల వాటాదారులకు

వేదాంత లాభం రూ.1,351 కోట్లు

Saturday 27th July 2019

12 శాతం డౌన్‌ నిర్వహణ లాభం రూ.5,578 కోట్లు  న్యూఢిల్లీ: మైనింగ్‌ కంపెనీ, వేదాంత నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 12 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ. 1,533 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,351 కోట్లకు తగ్గిందని వేదాంత తెలిపింది. కమోడిటీ ధరలు తగ్గడంతో నికర లాభం కూడా తగ్గిందని వేదాంత సీఈఓ శ్రీనివాసన్‌ వెంకటకృష్ణన్‌ తెలిపారు.  మొత్తం ఆదాయం రూ.22,624

Most from this category