News


నేడు ఆర్‌బీఐ బోర్డు సభ్యులతో సీతారామన్‌ భేటీ

Monday 8th July 2019
news_main1562562792.png-26886

  • బడ్జెట్‌లో చర్యలపై చర్చ...

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం(నేడు) రిజర్వ్‌ బ్యాంక్‌ కేంద్ర బోర్డు సభ్యులతో సమావేశం కానున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కీలక అంశాలను ఈ సందర్భంగా ఆమె ఆర్‌బీఐకి వివరించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యం ఇందులో ప్రధానంగా చర్చకు రానుంది. ఈ ఏడాది(2019-20) ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తాజా పూర్తిస్థాయి బడ్జెట్‌లో తగ్గించిన సంగతి తెలిసిందే. మధ్యంతర బడ్జెట్‌లో అంచనాలతో పోలిస్తే నికరంగా రూ.6,000 కోట్లు ఖజానాకు అదనంగా సమకూరనుండటంతో ఇది సాధ్యమైంది. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21) ద్రవ్యలోటు లక్ష్యాన్ని కూడా జీడీపీలో 3 శాతానికి కట్టడి చేయడం, ప్రాథమిక లోటును పూర్తిగా తొలగించడం వంటి అంశాలతో రోడ్‌మ్యాప్‌ను సీతారామన్‌ ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటారు. అదేవిధంగా ద్రవ్యలోటు నుంచి కేంద్రం చెల్లించాల్సిన వడ్డీలను మినహానయిస్తే, మిగిలిన లోటును ప్రాథమిక లోటుగా వ్యవహరిస్తారు. జీడీపీ వృద్ధిని మళ్లీ పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఇతరత్రా చర్యలను కూడా బోర్డు సభ్యులకు ఆర్థిక మంత్రి తెలియజేయనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికల్లా భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న బృహత్తర లక్ష్యాన్ని కేంద్రం నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్‌బీఐ మిగులు నిధుల విషయానికొస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.90,000 కోట్లను డివిడెండ్‌ రూపంలో చెల్లించనున్నట్లు అంచనా. గతేడాదితో పోలిస్తే(రూ.68,000 కోట్లు) ఇది 32 శాతం అదనం. అంతేకాదు ఇప్పటిదాకా ఆర్‌బీఐ నుం‍చి కేంద్రం అం‍దుకున్న అత్యధిక డివిడెండ్‌గా కూడా ఇది నిలవనుంది.



You may be interested

ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించండి

Monday 8th July 2019

జీవీకేకు సూచించిన ఢిల్లీ హైకోర్టు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బిడ్‌ సర్వీసెస్‌ కేసులో మధ్యంతర ఉపశమనం కోసం ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించుకోవచ్చని జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌కు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తనకున్న 13.5 శాతం వాటాను థర్డ్‌ పార్టీకి విక్రయించుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జ్‌ బెంచ్‌ ఇటీవల బిడ్‌ సర్వీసెస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జీవీకే కోర్టును

పీఎన్‌బీకి మరో షాక్‌!!

Monday 8th July 2019

రూ. 3,805 కోట్లు మోసం చేసిన భూషణ్ పవర్‌ అండ్ స్టీల్‌ న్యూఢిల్లీ: నీరవ్ మోదీ ఫ్రాడ్ నుంచి తేరుకునేందుకు నానా తంటాలు పడుతున్న ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కి మరో షాక్ తగిలింది. తాజాగా దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్‌ (బీపీఎస్‌ఎల్‌) సంస్థ దాదాపు రూ. 3,805.15 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు పీఎన్‌బీ వెల్లడించింది. ఖాతాల్లో అంకెల గారడీతో బ్యాంకుల కన్సార్షియం నుంచి

Most from this category