News


వీలైనంత త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తాం

Saturday 21st March 2020
news_main1584764398.png-32607

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
 కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న రంగాలకు ఆర్థిక ప్యాకేజీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం భరోసానిచ్చారు. అయితే, ఇందుకు ఎన్ని రోజులు పడుతుందన్న వివరాలను ఆమె వెల్లడించలేదు. పౌర విమానయానం, పర్యాటకం, ఎంఎస్‌ఎంఈ, పశుసంవర్ధక శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి సీతారామన్‌ ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయా శాఖల నుంచి వచ్చిన డిమాండ్లపై విస్తృతంగా చర్చించినట్టు మంత్రి తెలిపారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు శనివారం అంతర్గతంగా మరో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రధాని ప్రకటించిన కోవిడ్‌-19 ఎకనమిక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ ఇంకా ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ఆర్థిక రంగానికి సంబంధించి ఉపశమన చర్యల గురించి మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు.. సెబీ ప్రకటించిన నియంత్రణ చర్యలు మార్కెట్లలో కొంత స్థిరత్వాన్ని తీసుకొస్తాయన్నారు. ప్రస్తుత స్థితిలో ప్రతీ ఒక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకుని వాటిపై పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు చెప్పారు.
 

పర్యాటకానికి గడ్డు పరిస్థితి
‘‘పర్యాటక రంగంపై ప్రభావం ఉన్న విషయం మన అందరికీ తెలుసు. ఈ రంగానికి వచ్చే నష్టాల గురించి పూర్తి అధ్యయనం అనంతరం ఏదైనా ప్యాకేజీ ప్రకటించే అంశాన్ని నిర్ణయిస్తాం’’ అని పర్యాటక మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ తెలిపారు. 



You may be interested

నెల పాటు ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్‌

Saturday 21st March 2020

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌ ఇంటి నుంచి పనిచేసుకోవాలంటే బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ అవసరం ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమాచారం పంపడాలు, సంప్రదింపులు వంటివి చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక నెల రోజుల పాటు ఉచిత బ్రాడ్‌బ్యాండ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ల్యాండ్‌లైన్‌ కస్టమర్లు అందరూ, నూతనంగా బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ తీసుకునే కస్టమర్లు నెల రోజుల పాటు ఉచిత సదుపాయాన్ని పొందొచ్చని కంపెనీ తెలిపింది. కొత్తగా కాపర్‌ కేబుల్‌ ఆధారిత

టెలికం రంగానికి సత్వర సాయం కావాలి

Saturday 21st March 2020

పరిష్కారం  చూపించాలని కోరిన సీవోఐఏ  ‘‘తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న టెలికం రంగానికి తగిన పరిష్కారం చూపించేందుకు అందుబాటులో ఉన్న సాధనాలను వినియోగించుకోవాలని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ/ టెలికం కంపెనీల అసోసియేషన్‌) కోరింది. ఎటువంటి ఉపశమన ప్యాకేజీ కల్పించకపోతే ఎదురయ్యే పరిణామాల గురించి ప్రభుత్వానికి బాగానే తెలుసని పేర్కొంది. ‘‘టెలికం పరిశ్రమకు అత్యవసరంగా సాయం అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం తగిన పరిష్కారాలతో వెంటనే ముందుకు రావాలని కోరుతున్నాం’’

Most from this category