News


నిర్మలా శక్తి రామన్‌..

Saturday 14th December 2019
news_main1576294636.png-30217

- ఫోర్బ్స్‌ జాబితాలో 34వ స్థానం

న్యూయార్క్‌: ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ రూపొందిందిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా శక్తివంతమైన 100 మంది మహిళల 2019 జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేయగా.. ఇందులో మన దేశ ఆర్థిక మంత్రి 34వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.  గతంలో భారత రక్షణరంగానికి సారథ్యం వహించిన ఆమె.. ప్రస్తుతం మొత్తం భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తిస్థాయి బాధ్యతలు వహిస్తూ దేశ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్ణయాత్మక పాత్ర నిర్వహిస్తోన్నారు. కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు వంటి వ్యూహాత్మక నిర్ణయాలతో సత్తా చాటుతోన్న నిర్మలా సీతారామన్‌ ప్రతిభకు నిదర్శనంగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కింది. ఇక మన దేశం నుంచి మరో ఇద్దరు మహిళలకు ఈ తాజా జాబితాలో స్థానం లభించింది. హెచ్‌సీఎల్‌ ఎంటర్‌ప్రైజ్‌ రోష్ని నాడార్‌ మల్హోత్ర 54వ స్థానంలో నిలిచారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్‌ చీఫ్‌ బయోకాన్‌ కిరణ్‌ మజుందార్‌ షా 65వ స్థానాన్ని దక్కించుకున్నారు. 

అగ్రస్థానంలో ఏంజెలా మెర్కల్‌
ఈ ఏడాది జాబితాలో కూడా జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ నంబర్‌ వన్‌గా నిలిచారు. గత తొమ్మిదేళ్ళుగా అమె అత్యంత శక్తివంతమైన మహిళగా ఫోర్బ్స్‌ జాబితాలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటూనే ఉన్నారు. ఆ తరువాతి స్థానాన్ని యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అధ్యక్షురాలు క్రిస్టీనా లగార్డే సొంతం చేసుకున్నారు. ఇక అమెరికా ప్రతినిధుల సభకు స్పీకర్‌ అయిన నాన్సీ పెలోసీ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. యూరోపియన్ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్ డెర్ లేయన్ 4, జనరల్‌ మోటార్స్‌ సీఈఓ మేరీ బార్రా 5వ స్థానాన్ని దక్కించుకున్నారు.బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా 29 స్థానాన్ని దక్కించుకోగా.. అమెరికా అధ్యక్షడు డొనాల్డ్​ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ 42 స్థానంలో నిలిచారు. 



You may be interested

బ్యాంకింగ్‌కు మరింత ‘ఎన్‌బీహెచ్‌సీ’ తలనొప్పి

Saturday 14th December 2019

- మూడీస్‌ నివేదిక - మొండిబకాయిల  తీవ్రత పెరిగే అవకాశం ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లు ఎదుర్కొంటున్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సంక్షోభం బ్యాంకింగ్‌ మొండి బకాయిల (ఎన్‌పీఏ) భారాన్ని మరింత పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- మూడీస్‌ అంచనావేసింది. లిక్విడిటీ సమస్య వల్ల ఎన్‌బీఎఫ్‌సీలు కస్టమర్లకు రుణాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని... దీనితో బ్యాంకింగ్‌ రుణ పునఃచెల్లింపుల విషయంలో ఫండింగ్‌ లభించక సంబంధిత కస్టమర్లు ఇబ్బందులు పడే

నవంబర్‌లో ఫండ్స్‌ షేర్ల షాపింగ్‌

Friday 13th December 2019

నవంబర్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నికర పెట్టుబడుల రాక అంతక్రితం నెలతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. యాంఫి గణాంకాల ప్రకారం నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.1,311 కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్‌లో ఇవి రూ.6,026 కోట్లుగా ఉన్నాయి. ‍కాకపోతే సిప్‌ రూపంలో పెట్టుబడులు నవంబర్‌లో రూ.8,272 కోట్లకు చేరి ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. అక్టోబర్‌లో సిప్‌ పెట్టుబడులు రూ.8,245 కోట్లుగా ఉన్నాయి. నవంబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని

Most from this category