News


మౌలిక రంగం వృద్ధి ఎలా..!

Thursday 5th September 2019
news_main1567654317.png-28203

మౌలిక రంగం ప్రతినిధులతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం సమావేశమయ్యారు. వృద్ధి, ఉపాధి కల్పన వంటి అంశాల్లో ఈ రంగానికి కీలక పాత్ర ఉన్న నేపథ్యంలో- ఆర్థికమంత్రి జరిపిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మౌలికరంగం పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థికమంత్రి ఈ సమావేశంలో దృష్టి సారించినట్లు సమాచారం. ఆర్థిక మందగమనం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గత నెల నుంచీ ఆర్థికమంత్రి వివిధ వర్గాలతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌, ఫైనాన్స్‌ సెక్రటరీ రాజీవ్‌ కుమార్‌సహా ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ ఎన్‌ఎన్‌ సిన్హా, హెచ్‌సీసీ సీఎండీ అజిత్‌ గులాబ్‌చంద్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.



You may be interested

లాభాల ప్రారంభం

Thursday 5th September 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు అక్టోబర్‌ నుంచి పునర్‌ప్రారంభంకానున్నట్లు చైనా ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా గురువారం భారత్‌ స్టాక్‌ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌100 పాయింట్ల లాభంతో 36,825 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ16 పాయింట్ల లాభంతో 10,861 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. 

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రిలయన్స్ నేవల్‌

Thursday 5th September 2019

న్యూఢిల్లీ: వ్యాపారవేత్త అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన సంస్థలు మరింత సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. తాజాగా రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్‌ (ఆర్‌నేవల్‌) తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. దీంతో ఇప్పటికే పొందిన ఆర్డర్లను పూర్తి చేయడంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది. "పలు సవాళ్ల కారణంగా కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. రుణ పరిష్కార ప్రణాళిక ఇంకా సిద్ధం కాకపోవడంతో తీవ్ర నిధుల కొరత నెలకొంది. ఫలితంగా ప్రస్తుత ప్రాజెక్టుల

Most from this category