News


పన్ను వసూళ్లలో దూకుడొద్దు

Wednesday 28th August 2019
news_main1566967343.png-28066

  • పన్ను అధికారులకు ఆర్థిక మంత్రి సూచన

పుణె: పన్ను వసూళ్ల విషయంలో నిగ్రహం పాటించాలని, దూకుడుగా వ్యవహరించరాదని పన్ను అధికారులను కోరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పుణెలో మంగళవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి, కస్టమ్స్‌, ఆదాయపన్ను, జీఎస్టీ అధికారులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘వ్యాపారాలు ఉద్యోగాలను, సంపదను సృష్టిస్తాయి. కనుక పన్ను వసూలు చేయడమనే తమ ఉద్యోగ విధుల నిర్వహణ సందర్భంగా వ్యాపారులకు సహకరించడం ఎంతో అవసరం. పన్ను వసూళ్ల లక్ష్యం అసాధ్యమేమీ కాదని సంప్రదింపుల అనంతరం నిర్ణయానికొచ్చాం. నిర్దేశిత గడువు నాటికి వారు చేరుకోగలరు. కాకపోతే దూకుడుగా వ్యవహరించొద్దని పన్ను అధికారులకు నా అభ్యర్థన’’ అని మంత్రి అన్నారు. వ్యాపారస్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా వ్యాపారాలు చేసుకోవాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. జీఎస్టీ తగ్గింపు అన్నది తన చేతుల్లో లేదని, కాకపోతే ప్రతి ఒక్కరి అభిప్రాయాలను వినేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. 



You may be interested

100 లక్షల కోట్లకు మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు

Wednesday 28th August 2019

వచ్చే పదేళ్లలో చేరుకోవాలని యాంఫి లక్ష్యం ప్రస్తుతం ఫండ్స్‌ నిర్వహణలో  రూ.25 లక్షల కోట్లు న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ తన నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఇప్పుడున్న రూ.25 లక్షల కోట్ల నుంచి 100 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యం విధించుకుంది. అలాగే, ఇన్వెస్టర్ల సంఖ్యను 2 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచుకోవాలన్నది పరిశ్రమ లక్ష్యమని మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫి బీసీజీ విజన్‌ డాక్యుమెంట్‌ పేర్కొంది.

విస్తరణ బాటలో ‘రామ్‌రాజ్‌ కాటన్‌’

Wednesday 28th August 2019

- నెల్లూరులో 100వ షోరూం ప్రారంభం ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ రామ్‌రాజ్‌ కాటన్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో తన 100వ షోరూంను ప్రారంభించింది. సినీహీరో, సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌ దగ్గుబాటి వెంకటేష్‌ చేతుల మీదుగా నూతన ఎక్స్‌క్లూజీవ్‌ బ్రాండ్‌ అవుట్‌లెట్‌ ప్రారంభమైంది. సందర్భానికి తగినట్లుగా ఉండే దాదాపు 2,000 వెరైటీల ధోతీలను అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక తమకు 12,500 టెక్స్‌టైల్స్‌ రిటైలర్స్‌ ఉండగా.. లాభాపేక్ష లేకుండా, చేనేత కార్మికులకు అండగా

Most from this category