News


నేడు వేలానికి నీరవ్‌మోదీ విలాస వస్తువులు

Thursday 27th February 2020
news_main1582772422.png-32121

  • కార్లు, గడియారాలు, పెయింటింగ్‌లు

ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రుణాల రూపంలో రూ.14,000 కోట్లకు పైగా మోసగించి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త నీరవ్‌మోదీకి చెందిన విలాస వస్తువులు వేలానికి రానున్నాయి. అరుదైన పెయింటింగ్‌లు, చేతి గడియారాలు, లగ్జరీ కార్లు ఇలా 112 ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంస్థ ‘శాఫ్రోనార్ట్‌’ అనే సంస్థ ద్వారా వేలం వేయిస్తోంది. గురువారం వీటికి సంబంధించి ప్రత్యక్ష వేలం నిర్వహించనుంది. అనంతరం వచ్చే వారం 72 వస్తువులకు ఆన్‌లైన్‌ వేలం కూడా చేపట్టనుంది.
విలువైన పెయింటింగ్‌లు...

  • 1935నాటికి చెందిన అమృత షేర్‌ గిల్‌ వేసిన పెయింటింగ్‌ ‘బోయ్స్‌ విత్‌ లెమన్స్‌’’ అధికంగా రూ.12-18 కోట్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే విఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ వేసిన 1972 నాటి పెయింటింగ్‌ను కూడా వేలం వేయనున్నారు. దీనికి కూడా దగ్గర దగ్గర ఇంతే ధర వస్తుందని భావిస్తున్నారు. అలాగే వీఎస్‌ గైతోండే, మంజిత్‌బవా, రాజా రవివర్మ పెయింటింగ్‌లను గురువారం నాటి వేలంలో ఉంచనున్నారు. 
  • జాగర్‌ లీకోల్చర్‌ పురుషుల ‘రివర్స్‌ గైరోటర్బిల్లాన్‌ 2’ అనే లిమిటెడ్‌ ఎడిషన్‌ చేతి గడియారానికి రూ.70 లక్షలు వస్తుందని అంచనా. పటేక్‌ ఫిలిప్‌ నాటిలస్‌ అనే బంగారం, వజ్రాల చేతి గడియారానికి కూడా రూ.70 లక్షలు లభిస్తుందని భావిస్తున్నారు.
  • రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ కారు రూ.95 లక్షలు పలుకుతుందని అంచనా. 
  • బ్రాండెడ్‌ హ్యాండ్‌బ్యాగులను కూడా వేలంలో ఉంచనున్నారు. 
  • ఇక మార్చి 3, 4న పోర్షే ప్యానెమెరికా ఎస్‌ కార్‌ తదితర 72 వస్తువులకు ఆన్‌లైన్‌ వేలం నిర్వహించనున్నట్టు శాఫ్రోనార్ట్‌ తెలిపింది.   



You may be interested

2019లో దేశంలో కొత్తగా 34 బిలియనీర్లు

Thursday 27th February 2020

దేశంలో 138కి చేరిన బిలీయనీర్ల సంఖ్య 799 మందితో చైనా నంబర్‌ 1 626 మందితో అమెరికా రెండో స్థానం సంపన్న భారతీయుడు ముకేశే: హరూన్‌ ముంబై: దేశంలో సంపన్నుల సంఖ్య 2019లో ఎక్స్‌ప్రెస్‌ వేగంతో పెరిగింది. ప్రతీ నెలా సుమారు ముగ్గురు చొప్పున కొత్తగా బిలియనీర్లు పుట్టుకొచ్చారు. మొత్తం మీద 2019లో 34 మంది బిలియనీర్లు అదనంగా జత కూడడంతో దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 38కి చేరుకుందని హరూన్‌ గ్లోబల్‌రిచ్‌ లిస్ట్‌ 2020

నిబంధనలు సరళిస్తేనే మరిన్ని వీసాలు!

Thursday 27th February 2020

అప్పుడే అక్కడ పెట్టుబడులు పెట్టగలం ట్రంప్‌తో సమావేశంలో టెక్‌ కంపెనీల వెల్లడి నిబంధనలను సడలిస్తున్నట్లు చెప్పిన ట్రంప్‌ ‘సాక్షి’తో సైయంట్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారతీయ టెక్నాలజీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలన్నా, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నా నిబంధనల సరళీకరణ కీలకమని, సులభతర వ్యాపార నిబంధనలుంటేనే స్థానిక ప్రభుత్వానికి ఆదాయంతో పాటు, ఉద్యోగాలూ వస్తాయని సైయంట్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు. భారతీయ టెక్నాలజీ కంపెనీలు

Most from this category