News


నిప్పన్‌ చేతికి రిలయన్స్‌ ఏఎంసీ వ్యాపారం

Tuesday 8th October 2019
news_main1570510630.png-28769

- రూ. 6,000 కోట్లు చెల్లించి 75 శాతం వాటా కైవసం
- నిప్పన్‌ ఇండియా ఎంఎఫ్‌గా పేరు మార్పు

ముంబై: రిలయన్స్‌ క్యాపిటల్‌కు చెందిన అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ)లో.. జపాన్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం నిప్పన్‌ లైఫ్ తనకు ఉన్న వాటాను పెంచుకోవడం ద్వారా ఏఎంసీ వ్యాపారాన్ని కైవసం చేసుకుంది. అనీల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌కు రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌ (ఆర్‌నామ్‌)లో ఉన్న మొత్తం వాటాను కొనుగోలుచేసింది. ఇంతకుముందు (2012లో) 26 శాతం వాటాను సొంతం చేసుకున్న నిప్పన్‌.. తాజాగా ఈ వాటాను 75 శాతానికి పెంచింది. ఇందుకోసం రూ. 6,000 కోట్లను రిలయన్స్‌ క్యాపిటల్‌కు చెల్లించినట్లు ఆర్‌నామ్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ సుందీప్ సిక్కా వెల్లడించారు. కొనుగోలు పూర్తి అయినందున కంపెనీ పేరును నిప్పన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ (ఎన్‌ఐఎంఎఫ్‌)గా మార్చినట్లు చెప్పారు. గత కొద్ది సంవత్సరాల కిందట వరకు నిర్వహణలో ఉన్న ఆస్తుల పరంగా మార్కెట్‌ లీడర్‌గా కొనసాగిన సంస్థ.. ఇటీవల 5వ స్థానానికి పడిపోగా, మళ్లీ కంపెనీకి పూర్వ స్థాన్నాన్ని అందించడం కోసం నిప్పన్‌తో కలిసి పనిచేయనున్నట్లు వివరించారు. నూతన సంస్థను తానే నడిపించనున్నట్లు స్పష్టంచేశారు. ఇక ఈ ఏడాది జూన్‌ నాటికి కంపెనీ ఏయూఎం రూ. 2.22 కోట్లుగా ఉంది.



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్ల హోల్డింగ్‌ స్తంభన

Tuesday 8th October 2019

సీడీఎస్‌ఎల్‌ నిర్ణయం  క్యూ1 ఫలితాలు వెల్లడించలేకపోవడమే కారణం  న్యూఢిల్లీ: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పరేషన్‌ లిమిటెడ్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీ ప్రమోటర్ల షేర్ల హోల్డింగ్‌ను డిపాజిటరీ సంస్థ సీడీఎస్‌ఎల్‌ స్తంభింపజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఇప్పటివరకూ వెల్లడించకపోవడమే దీనికి కారణమని సమాచారం. కాగా మరికొన్ని వారాల్లోనే ఆర్థిక ఫలితాలను వెల్లడించే అవకాశాలున్నాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయమై ఈ నెల 17న  బోర్డ్‌ మీటింగ్‌ను  ఏర్పాటు చేయనున్నామని

ఈ-అసెస్‌మెంట్ వ్యవస్థ ప్రారంభం

Tuesday 8th October 2019

- తొలిదశలో పరిశీలనకు 58 వేల కేసులు - ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు నోటీసులు న్యూఢిల్లీ: పన్ను విధానాల సంస్కరణల్లో భాగంగా ఆదాయపు పన్ను శాఖ మరో కీలక ప్రతిపాదనను అమల్లోకి తెచ్చింది. పన్నుల మదింపు ప్రక్రియలో అధికారుల ప్రమేయాన్ని గణనీయంగా తగ్గించే దిశగా ఎలక్ట్రానిక్‌ (ఫేస్‌లెస్‌) అసెస్‌మెంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన నేషనల్ ఈ-అసెస్‌మెంట్ సెంటర్‌ను (ఎన్‌ఈఏసీ) కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌ భూషణ్ పాండే సోమవారం ప్రారంభించారు.

Most from this category