News


ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ డివిడెండ్‌ రూ.10

Thursday 30th January 2020
news_main1580358438.png-31325

  • 34 శాతం పెరిగిన లాభం 

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో 34 శాతం ఎగసి రూ.123 కోట్లకు చేరింది. ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.1,073 కోట్లకు పెరిగిందని ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ తెలిపింది. ఆర్డర్లు వరుసగా 11వ క్వార్టర్‌లోనూ పెరిగాయని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.10 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో తామందిస్తున్న రెండో డివిడెండ్‌ ఇదని పేర్కొంది. ఈ డివిడెండ్‌కు రికార్డ్‌ డేట్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 10 అని కంపెనీ తెలిపింది. 



You may be interested

తాజ్‌జీవీకే లాభం రూ.11 కోట్లు

Thursday 30th January 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ 33 శాతం వృద్ధితో రూ.11.14 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.8.37 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.91.22 కోట్లు కాగా.. 2018 క్యూ3లో రూ.86.11 కోట్లుగా ఉంది. సంజీవ్‌ రెడ్డి రాజీనామా... ఇన్నాళ్లూ తాజ్‌జీవీకేలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ నాన్‌–ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న జీవీ

ఆర్‌ఐఎల్‌ డౌన్‌గ్రేడ్‌-మెక్వ్యరీ

Thursday 30th January 2020

నేలచూపులతో ప్రారంభమైన రిలయన్స్‌ షేరు నష్టాలతో కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు విదేశీ రీసెర్చ్‌ సంస్థ మెక్వ్యరీ తాజాగా పేర్కొంది. రూ. 1300 టార్గెట్‌ ధరను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. కాగా.. కరోనా వైరస్‌ జపాన్‌కూ చేరిన వార్తలతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లు డీలా పడ్డాయి. నేడు సమావేశంకానున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా వైరస్‌పై గ్లోబల్‌ ఎమర్జెన్సీను ప్రకటించన్నుట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో దేశీ

Most from this category