News


మూడేళ్ల కనిష్ఠానికి నిఫ్టీ ఆటో

Friday 19th July 2019
news_main1563532197.png-27189

మరింత కుంగవచ్చంటున్న నిపుణులు
తగ్గిపోతున్న విక్రయాలు, బలహీన రుతుపవనాలు, వ్యవస్థలో నగదు సన్నగిల్లడం, ఎకానమీలో మందగమన సంకేతాలు... ఆటో సూచీని కుంగదీస్తున్నాయి. వినిమయ విభాగంలో ఆటో రంగం నెగిటివ్‌ సెంటిమెంట్‌ దెబ్బకు విలవిలలాడుతోంది. గత కొంతకాలంగా నేలచూపులు చూస్తున్న నిఫ్టీ ఆటో సూచీ తాజాగా మూడేళ్ల కనిష్టానికి చేరింది. ఇంతటితో పతనం ముగియలేదని, మరింత అధ్వాన్నం ముందుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్యు1లో ఆటో విక్రయాలు గత ఐదేళ్లలో లేనంత వేగంగా క్షీణించాయి. బీమా వ్యయాలు పెరగడం, ద్విచక్రవాహన సేఫ్టీ నిబంధనల మార్పులు, ధరల పెంపు, లిక్విడిటీ కొరత లాంటివి విక్రయాలను దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో ఆటో రంగంలో రికవరీ ఇప్పుడిప్పుడే కనిపించదని అంచనాలున్నాయి.
ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ ప్రకారం ఆటో రంగంలో డౌన్‌సైకిల్‌ సగంలో ఉంది. అందువల్ల గతంలోలాగా వాల్యూం రికవరీ వేగంగా, బలంగా ఉండకపోవచ్చు. తాజా మందగమనానికి అంతర్జాతీయ కారణాల కన్నా దేశీయ కారణాలే అధికమని ఎడెల్‌వీజ్‌ నివేదిక అభిప్రాయపడింది. డౌన్‌ సైకిల్స్‌ సరాసరిన దాదాపు 7-11 త్రైమాసికాలు అంటే దాదాపు 2-4 సంవత్సరాలు కొనసాగుతుంటాయని జెఫర్రీస్‌ తెలిపింది. అయితే ఒక్కోసారి ఇవి 8 సంవత్సరాలు కూడా ఉండొచ్చని తెలిపింది. బీఎస్‌6 నిబంధనల అమలు గడువు దగ్గరకు రావడం కూడా ఆటో రంగంపై ఒత్తిడి పెంచుతోందని తెలిపింది. 
ఆటో సూచీ శుక్రవారం పతనంతో 2016 స్థాయిలకు దిగివచ్చింది. ఈ పతనం రెండు దశల్లో జరిగిందని, ఇకపై కూడా కొనసాగవచ్చని జెఫర్రీస్‌ అంచనా. ఆటో స్టాకుల్లో మారుతీ, ఎంఅండ్‌ఎం, టీవీఎస్‌, ఐషర్‌, ఫోర్స్‌ మోటర్స్‌లు, ఆటో అనుబంధ రంగాల స్టాకుల్లో బోష్‌, ఎక్సైడ్‌, ఎండ్యూరెన్స్‌ షేర్లు బహుళ సంవత్సర కనిష్టాలకు వచ్చాయి. ఈ ఏడాది ఇంతవరకు నిఫ్టీ ఆటో 21 శాతానికి పైన పతనమైంది. పలు ప్రముఖ కంపెనీల మార్కెట్‌ వాల్యూషన్‌ భారీగా తగ్గింది. చాలా కంపెనీల షేర్లను బ్రోకరేజ్‌లు డౌన్‌గ్రేడ్‌ చేయడం, టార్గెట్స్‌ను తగ్గించడం చేశాయి. కేవలం కొన్ని స్టాకులు మాత్రమే రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చూశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లిక్విడిటీ పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవడం, విత్త పరిస్థితులు మెరుగవడం జరిగితేనే ఆటో రంగంలో రికవరీ కనిపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. You may be interested

పబ్లిక్‌ వాటా పెంపు నిబంధన అమలు కష్టమే: సెబి

Friday 19th July 2019

తాజా బడ్జెట్లో తీసుకున్న ప్రతిపాదనల వలన తమ పాత్ర తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అభిప్రాయపడింది. నిధుల కోసం ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో ... కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను సెబి అమలుచేయడం కష్టమని సెబి అధికారి ఒకరు చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలే కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ను 25 శాతానికి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫలితాలు ఎలా ఉంటాయి?

Friday 19th July 2019

మార్కెట్‌ వాల్యూషన్‌ పరంగా దేశంలో అతిపెద్ద బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ జూన్‌ త్రైమాసిక ఫలితాలను శనివారం ప్రకటించనుంది. ఈ దఫా కూడా ఎప్పటిలాగే బ్యాంకు మంచి ఫలితాలు ప్రకటించవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  - ప్రభుదాస్‌ లీలాధర్‌: గతేడాది క్యు1తో పోలిస్తే బ్యాంకు లాభంలో 27.50 శాతం, నికర వడ్డీ ఆదాయంలో 23.40 శాతం పెరుగుదల ఉండొచ్చు. ప్రీప్రొవిజనింగ్‌ కార్యనిర్వాహక లాభంలో కూడా 25.20 శాతం వృద్ధి ఉండొచ్చు. ఎప్పుడూ బ్యాంకు

Most from this category