News


ఎన్‌హెచ్‌ఏఐ పటిష్టంగానే ఉంది

Thursday 5th September 2019
news_main1567653918.png-28201

  • ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదు
  • పైప్‌లైన్‌లో ఎన్నో ప్రాజెక్టులు
  • చైర్మన్‌ సిన్హా ప్రకటన

న్యూఢిల్లీ: జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదని చైర్మన్‌ ఎన్‌ఎన్‌ సిన్హా స్పష్టం చేశారు. చాలా బలమైన స్థితిలోనే ఎన్‌ఎచ్‌ఏఐ ఉందని, ప్రణాళికలో ఎన్నో ప్రాజెక్టులు కూడా ఉన్నట్టు తెలిపారు. గతేడాది 3,300 కిలోమీటర్ల మేర రహదారుల ప్రాజెక్టులను చేపట్టగా, ప్రస్తుత ఏడాది 4,500 కిలోమీటర్ల మేర ప్రాజెక్టులను నిర్మించనున్నామని ఆయన చెప్పారు. ‘‘ఎన్‌హెచ్‌ఏఐకు అనిశ్చయ నష్టాలు రూ.3 లక్షల కోట్ల మేర ఉంటాయని మీడియాలోని కొన్ని సెక్షన్లలో కథనాలు వచ్చాయి. ‘‘అనిశ్చయ నష్టాలను వారు సరిగా అర్థం చేసుకోకపోవడం లేదా ఆ గణాంకాలను పొరపాటుగా పేర్కొనడం జరిగింది. అనిశ్చయ నష్టాలన్నవి సహజంగానే అస్పష్టతతో ఉంటాయి. మా పరిశీలన, చెల్లింపుల రేషియో ప్రకారం చూస్తే ఆ స్థాయి నష్టాలేమీ ఉండబోవు. ఎన్‌హెచ్‌ఏఐ నుంచి క్లెయిమ్‌ బాధ్యతలన్నవి రూ.70,000 కోట్ల వరకు ఉంటాయి’’ అని సిన్హా వివరించారు. అదే సమయంలో తమకు ఎన్నో రూపాల్లో ఆదాయం ఉందని వివరించారు. అనిశ్చితిని సృష్టించడానికే సంబంధిత కథనాలను సృష్టించినట్టుగా ఉందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ గడిచిన ఏడాదితో పోలిస్తే వెయ్యి కిలోమీటర్ల మేర అదనంగా రహదారులను ఈ ఏడాది నిర్మించనున్నట్టు చెప్పారు. బడ్జెట్‌ నుంచి మరిన్ని నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపారు. జాతీయ రహదారుల నుంచి వచ్చే ఆదాయానికి అదనంగా, మార్కెట్‌ నుంచి నిధులను కూడా సమీకరించనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్‌)ను తీసుకువస్తామని, కేబినెట్‌ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్టు వెల్లడించారు. 



You may be interested

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రిలయన్స్ నేవల్‌

Thursday 5th September 2019

న్యూఢిల్లీ: వ్యాపారవేత్త అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన సంస్థలు మరింత సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. తాజాగా రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్‌ (ఆర్‌నేవల్‌) తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. దీంతో ఇప్పటికే పొందిన ఆర్డర్లను పూర్తి చేయడంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది. "పలు సవాళ్ల కారణంగా కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. రుణ పరిష్కార ప్రణాళిక ఇంకా సిద్ధం కాకపోవడంతో తీవ్ర నిధుల కొరత నెలకొంది. ఫలితంగా ప్రస్తుత ప్రాజెక్టుల

భారీ డిస్కౌంట్లను ప్రకటించిన మారుతీ

Thursday 5th September 2019

రూ. 1.12 లక్షల వరకు తగ్గింపు న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) తాజాగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మోడల్‌ ఆధారంగా రూ. 1.12 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. విటారా బ్రెజా, స్విఫ్ట్‌, డిజైర్‌, సియాజ్‌ కార్లకు ఈ స్థాయి వరకు డిస్కౌంట్‌ వర్తిస్తుందని వివరించింది. విటారా బ్రెజాకు కస్టమర్‌ ఆఫర్‌ రూ. 50000, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ రూ. 20000, కార్పొరేట్‌

Most from this category