News


మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌లో వాటా కొన్న న్యూయార్క్‌ లైఫ్‌

Friday 14th December 2018
news_main1544762869.png-22911

న్యూఢిల్లీ: మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఎమ్‌ఎఫ్‌ఎస్‌) కంపెనీలో 2 శాతం వాటాను అమెరికాకు చెందిన న్యూయార్క్‌ లైఫ్‌ కంపెనీ కొనుగోలు చేసింది. డీల్‌ విలువ రూ.215 కోట్లు. బల్క్‌ డీల్‌ డేటా ప్రకారం... మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రమోటర్‌ కంపెనీ మ్యాక్స్‌ వెంచర్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ నుంచి దాదాపు 2 శాతం వాటాకు సమానమైన 49,99,130 షేర్లను న్యూయార్క్‌ లైఫ్‌ కొనుగోలు చేసింది. ఒక్కో షేర్‌ సగటు కొనుగోలు విలువ రూ.429.50గా ఉంది. ఈ వాటా విక్రయం అనంతరం ఎమ్‌ఎఫ్‌ఎస్‌లో ప్రమోటర్‌ వాటా 30.29 శాతం నుంచి 28.42 శాతానికి తగ్గింది. గత రెండు రోజుల్లో  న్యూయార్క్‌ లైఫ్‌ కంపెనీ బహిరంగ మార్కెట్‌ కార్యకలాపాల ద్వారా ఎమ్‌ఎఫ్‌ఎస్‌ షేర్లను కొనుగోలు చేసింది. గురువారం బీఎస్‌ఈలో మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్‌ 3 శాతం లాభంతో రూ.443 వద్ద ముగిసింది. 



You may be interested

రెండు రోజుల్లోనే మొబైల్ నంబర్ పోర్టింగ్

Friday 14th December 2018

న్యూఢిల్లీ: మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ప్రక్రియను మరింత సులభతరం, వేగవంతం చేసేలా టెలికం రంగ నియంత్రణ సంస్థ చర్యలు ప్రకటించింది. ఒకే సర్వీస్ ఏరియా పరిధిలో నంబరును పోర్ట్‌ చేసేందుకు గడువును రెండు రోజులకు పరిమితం చేసింది. అలాగే, ఒక సర్కిల్ నుంచి మరో సర్కిల్‌కు పోర్ట్‌ అవుట్ వ్యవధిని నాలుగు రోజులుగా నిర్దేశించింది. యూజర్లకు అనుకూల విధానాల అమల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాయ్ తెలిపింది.

ప్రభుత్వానికి ఆర్‌బీఐ మద్దతివ్వాలి

Friday 14th December 2018

ముంబై: ఆర్‌బీఐని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వీర్యం చేయబోదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ ప్రభుత్వంలో ఒక భాగమని, అది ప్రభుత్వ ఆర్థిక విధానానికి మద్దతుగా నిలవాలని అభిప్రాయపడ్డారు. కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదాల వల్ల ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో మంత్రి గడ్కరీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉర్జిత్‌ పటేల్‌ స్థానంలో శక్తికాంత్‌ దాస్‌ ఆర్‌బీఐ

Most from this category