News


ఎన్‌బీఎఫ్‌సీల దివాలా ప్రక్రియకు మార్గదర్శకాలు

Saturday 16th November 2019
news_main1573875886.png-29630

న్యూఢిల్లీ: బ్యాంకులు కాకుండా వ్యవస్థాగతంగా కీలకమైన ఇతరత్రా ఆర్థిక సేవల సంస్థల(ఎఫ్‌ఎస్‌పీ) దివాలా ప్రక్రియ, మూసివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ వీటిని నోటిఫై చేసింది. దివాలా కోడ్‌లోని సెక్షన్‌ 227 ప్రకారం.. వ్యవస్థాగతంగా ఏయే ఎఫ్‌ఎస్‌పీలు కీలకమైనవి, ఏవి ఆ పరిధిలోకి రావన్నది కేంద్ర ప్రభుత్వం కేటగిరీల వారీగా నిర్ణయిస్తుంది. ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలతో సంప్రతింపుల మేరకు సంక్షోభంలో ఉన్న ఎఫ్‌ఎస్‌పీల దివాలా ప్రక్రియ గురించి నోటిఫై కూడా చేయొచ్చు. దివాలా ప్రక్రియ కింద చర్యలెదుర్కొనే ఎఫ్‌ఎస్‌పీల నిర్వహణకు సంబంధించి నియంత్రణ సంస్థ ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేటర్‌ను నియమిస్తుంది. అలాగే, సదరు సంస్థ నిర్వహణలో తగు సలహాలు, సూచనలు చేసేందుకు సలహాదారు కమిటీని కూడా ఏర్పాటు చేయొచ్చు. బ్యాంకులు, ఇతర ఎఫ్‌ఎస్‌పీలకు సంబంధించి పూర్తి స్థాయి నిబంధనలను రూపొందించే దాకా ఈ తాత్కాలిక మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ తెలిపారు. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 



You may be interested

ఐసీఐసీఐ బ్యాంక్‌ ‘మహా లోన్ ధమాకా’

Saturday 16th November 2019

 దేశవ్యాప్తంగా 2,000 లోన్‌ క్యాంప్స్‌ ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌.. తక్షణ రుణ మంజూరీ సేవలను అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం ‘మహా లోన్ ధమాకా’ పేరిట ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,000 రుణ శిబిరాలను ఏర్పాటుచేయనుంది. వ్యక్తిగత, వాహన, బంగారు రుణాలతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను ఈ క్యాంప్స్‌ ద్వారా జారీ చేయనున్నట్లు వివరించింది. హ్యుందాయ్‌ మోటార్స్‌ వంటి కంపెనీలతో ఏర్పాటుచేసుకున్న ఒప్పందం

ఆల్‌టైమ్‌ గరిష్టానికి ఫారెక్స్‌ నిల్వలు

Saturday 16th November 2019

447.81 బిలియన్‌ డాలర్లకు చేరిక ముంబై: విదేశీ మారక(ఫారెక్స్‌) నిల్వలు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నవంబర్‌ 8తో ముగిసిన వారానికి ఫారెక్స్‌ నిల్వలు 1.710 బిలియన్‌ డాలర్లు పెరిగి 447.81 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గ‌తవారం ఈ నిల్వలు 446.098 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏలు) పెరగిన కారణంగానే రికార్డు

Most from this category