STOCKS

News


జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిశీలనలో 66.79 లక్షల రిజిస్ట్రేషన్లు

Tuesday 24th December 2019
news_main1577161098.png-30402

బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ
బెంగళూరు: పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన 66.79 లక్షల నూతన రిజిస్ట్రేషన్లు నకిలీవా లేక షెల్‌ కంపెనీలకు సంబంధించినవా అన్నది జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిశీలిస్తోందని బిహార్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ తెలిపారు. ఇంటెగ్రేటెడ్‌ జీఎస్‌టీకి సంబంధించి మంత్రుల బృందానికి ఆయన కన్వీనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ‘‘నూతన పన్ను చెల్లింపుదారులు (వీరి సంఖ్య 66.7 లక్షలు ఉంటుంది) 15 శాతమే పన్ను చెలిస్తున్నారు. ఈ మొత్తం రూ.10,000 కోట్లు. దీంతో నూతన పన్ను చెల్లింపుదారులు నకిలీ కాదు కదా అన్నది నిర్ధారించుకునేందుకు పరిశీలన చేస్తున్నాం’’ అని సుశీల్‌కుమార్‌ మోదీ తెలిపారు. జీఎస్‌టీ ప్రారంభమైన తర్వాత పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.21 కోట్లకు చేరిందన్నారు. ఇందులో 66.79 లక్షలు నూతన రిజిస్ట్రేషన్లుగా పేర్కొన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఉన్న కంపెనీల ప్రాంగణాలను స్వయంగా సందర్శించి, ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తున్నట్టు వివరించారు. 
3బీ రిటర్నులు దాఖలు చేయకపోతే..
వరుసగా రెండు నెలల పాటు 3బీ రిటర్నులు దాఖలు చేయకపోతే వ్యాపారుల ఈవే బిల్లు బ్లాక్‌ చేయడం జరుగుతుందని సుశీల్‌కుమార్‌ మోదీ తెలిపారు. ఇప్పటి వరకు 3.47 లక్షల డీలర్ల ఈవే బిల్లులను బ్లాక్‌ చేశామని చెప్పారు. 3బీ రిటర్ను దాఖలు చేసిన తర్వాత తిరిగి ఈ బిల్లు జారీ అవుతుందన్నారు. 



You may be interested

మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ రియో ఎలైట్

Tuesday 24th December 2019

ధర రూ. 45,099  ముంబై: గ్రీవ్స్‌ కాటన్‌ ఈ-మొబిలిటీ అనుబంధ సంస్థ యాంపియర్ వెహికిల్స్‌.. ‘రియో ఎలైట్’ పేరిట సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 45,099 (ఎక్స్‌-షోరూం-బెంగళూరు)గా ప్రకటించింది. ఎల్‌ఈడీ డిజిటల్ డాష్‌బోర్డ్, డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్, యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్ వంటి ఫీచర్లు ఉన్నట్లు వివరించింది. 48వీ-20ఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ స్కూరట్లను సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. యాంపియర్ వెహికిల్స్‌

టెల్కో లైసెన్స్‌ ఫీజుల తగ్గింపు!

Tuesday 24th December 2019

త్వరలో ప్రభుత్వ ప్రకటన టెలికం కంపెనీల లైసెన్సు ఫీజులను ప్రభుత్వం త్వరలో 8 నుంచి 6- 5 శాతానికి తగ్గించనుంది. టెలికం కంపెనీలకు ఊరట కలిగించే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సీనియర్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ ఒకటి లైసెన్సుఫీజుల తగ్గింపుపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఫీజుల తగ్గింపుతో మూడు టెలికం కంపెనీలకు కలిపి దాదాపు రూ.4-5 వేల కోట్ల ప్రయోజనం చేకూరనుంది. అయితే ఇది

Most from this category