News


ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ నిబంధనల సెగ

Tuesday 28th May 2019
news_main1559028955.png-25958

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ లిక్విడిటీ నిబంధనల ముసాయిదాతో నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) మార్జిన్లు, రాబడులపై మధ్యకాలికంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిపాదిత నిబంధనల కారణంగా ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంస్థల విలీనాలు, కొనుగోళ్లకు కూడా ఆస్కారం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇ‍క్రా పేర్కొంది. రూ. 100 కోట్ల అసెట్స్ పరిమాణం గల ఎన్‌బీఎఫ్‌సీలు .. లిక్విడిటీపరమైన రిస్కులను ఎదుర్కొనేందుకు పాటించాల్సిన విధానాలపై ఆర్‌బీఐ ముసాయిదా సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎంతటి కష్టతరమైన పరిస్థితుల్లోనైనా నెగ్గుకొచ్చేలా కనీసం 30 రోజులకు సరిపడేంత నిధులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని ఇందులో ప్రతిపాదించింది. ఇలా చేయాలంటే తక్కువ రాబడులిచ్చే సురక్షితమైన సాధనాల్లో ఎన్‌బీఎఫ్‌సీలు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని, ఫలితంగా వాటి నికర మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుందని ఇక్రా పేర్కొంది. ప్రధానంగా గృహ రుణాల కంపెనీలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ ఇండియా తెలిపింది. 



You may be interested

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Tuesday 28th May 2019

43 శాతం తగ్గిన మదర్సన్‌సుమీ లాభం న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ మదర్సన్‌ సుమీ సిస్టమ్స్‌ ఫలితాల విషయంలో నిరుత్సాహపరిచింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ లాభం రూ.43 శాతానికి పైగా క్షీణించి రూ.429 కోట్లకు పరిమితం అయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.757 కోట్లుగా ఉంది. ఆదాయం మాత్రం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.15,407 కోట్ల నుంచి రూ.17,169 కోట్లకు వృద్ధి చెందింది.

ఆర్ధిక స్థితి ఆందోళనకరం

Tuesday 28th May 2019

 రేటింగ్ సంస్థల విశ్లేషణ తక్షణ చర్యలకై విజ్ఞప్తి మే 31 జీడీపీ గణాంకాల విడుదల రానున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ నేపథ్యం భారత ఆర్థిక పరిస్థితిపై పలు ఆర్థిక విశ్లేషణా సంస్థలు, రేటింగ్‌ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణం చర్యలకు సూచిస్తున్నాయి. మే 31 వ తేదీన 2018-19 (ఏప్రిల్‌-మార్చి) ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు విడుదల కానుండడం దీనికి నేపథ్యం. వచ్చే ఒకటి, రెండు నెలల్లో  కేంద్రం 2019-2020

Most from this category