News


బీఓబీ, బీఓఐ, కెనరాబ్యాంక్‌లకు కొత్త చీఫ్‌లు

Wednesday 22nd January 2020
news_main1579663367.png-31086

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ), కెనరాబ్యాంక్‌లకు కొత్త ఎండీ అండ్‌ సీఈఓలు నియమితులయ్యారు. నియామకపు వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఇందుకు సంబంధించిన నియామకాలకు ఆమోదముద్ర వేసింది.  వేర్వేరుగా చూస్తే...

బీఓబీ:- సంజయ్‌ చంద్ర ఎండీ అండ్‌ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం సంజయ్‌ చంద్ర బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.  పీఎస్‌ జయకుమార్‌ స్థానంలో సంజయ్‌ చంద్ర నియామకం జరిగింది. జయకుమార్‌ అక్టోబర్‌లో పదవీ విరమణ చేశారు.  ఇటీవలే దేనా బ్యాంక్‌, విజయాబ్యాంక్‌లు బీఓబీలో విలీనం అయిన సంగతి తెలిసిందే. 

బీఓఐ:- బ్యాంక్‌ ఎండీ సీఈఓగా అతను కుమార్‌ దాస్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం దాస్‌ ఇదే బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ అండ్‌ సీఈఓ కుర్చీ గత ఏడాది జూలై నుంచీ భర్తీకాలేదు. 

కెనరా బ్యాం‍క్‌:- లింగమ్‌ వెంకట్‌ ప్రభాకర్‌ ఎండీ అండ్‌ సీఈఓగా నియమితులయ్యారు. కెనరాబ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాం‍క్‌ విలీనం కానున్న సంగతి తెలిసిందే.  ప్రభాకర్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ నెలాఖరున రిటైర్‌ కానున్న ఆర్‌ఏ శంకర్‌ నారాయణన్‌ స్థానంలో ప్రభాకర్‌ బాధ్యతలు చేపడతారు. 



You may be interested

నిఫ్టీ నిరోధం 12,212, 12,255

Wednesday 22nd January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 48 పాయింట్లు ప్లస్‌ నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల(గ్యాప్‌ అప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 48 పాయింట్లు ఎగసి 12,248 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,200 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ప్రపంచ ఆర్థిక వృద్ధి

ఆ మూడూ తరవాతే ఇండియా!

Wednesday 22nd January 2020

అమెరికా, చైనా, జర్మనీకే ఇన్వెస్టర్ల పెద్దపీట అంతర్జాతీయ వృద్ధిపై సీఈవోల్లో సన్నగిల్లిన విశ్వాసం భారత సీఈవోల్లో పెరిగిన ఆశాభావం పీడబ్ల్యూసీ సీఈవో సర్వే వెల్లడి దావోస్‌: అంతర్జాతీయ వృద్ధి పట్ల సీఈవోల్లో విశ్వాసం కనిష్ట స్థాయికి చేరింది. అయినా కానీ, అంతర్జాతీయంగా అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్‌ వారికి నాలుగో ప్రాధాన్య దేశంగా ఉన్నట్టు పీడబ్ల్యూసీ సంస్థ సీఈవోలపై నిర్వహించిన సర్వే ‍స్పష్టం చేసింది. భారత్‌లో తమ వ్యాపార వృద్ధికి అనుకూల పరిస్థితులున్నట్టు అంతర్జాతీయంగా

Most from this category